Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Honey Trap : అందమైన వల.. హానీ ట్రాప్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..!

యువకులకు అందమైన వల విసురుతారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఇతర వేదికలే వారికి అడ్డాలు. ఒంటరిగా కనిపించే పురుషులతో మాట కలుపుతారు. ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. ప్రతిరోజు ఫోన్లు మాట్లాడతారు.

Honey Trap : అందమైన వల.. హానీ ట్రాప్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

యువకులకు అందమైన వల విసురుతారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఇతర వేదికలే వారికి అడ్డాలు. ఒంటరిగా కనిపించే పురుషులతో మాట కలుపుతారు. ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. ప్రతిరోజు ఫోన్లు మాట్లాడతారు.

ఆ తర్వాత నువ్వంటే ఇష్టం అని ఇంటికి రమ్మంటారు. వెళ్తే ఇక అంతే సంగతులు. ఇక వారి పని మొదలు పెడతారు. వెళ్లిన వారికి తెలియకుండా ఫోటోలు, వీడియోలు తీస్తారు. వాటితో వారిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. డబ్బులు ఇవ్వాలని లేదంటే అత్యాచారం చేయబోయారంటూ కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడతారు.

అయితే హాని ట్రాప్ లో చిక్కుకున్న పురుషులు కొంతమంది బయటకు వచ్చారు. మరి కొంతమంది పరువు పోతుందని భయపడి సర్దుకుపోతారు. ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు హాని ట్రాప్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హానీ ట్రాప్ కు పాల్పడిన నలుగురు మహిళలను అరెస్టు చేశారు. బాధితుడి నుంచి ఇప్పటికే 10 లక్షలు వరకు గుంజునట్లు పోలీసులు గుర్తించారు.

రాజమండ్రి తాటి కోటకు చెందిన నవీన, సత్యవతి, వెంకటలక్ష్మి తో పాటు మరో మహిళను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ముఠాపై గతంలో కూడా కేసులు ఉన్నాయని, బెయిల్ పై విడుదలయ్యారని, ఆ తర్వాత మళ్లీ హాని ట్రాప్ మొదలు పెట్టారని పోలీసులు పేర్కొంటున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కూడా కోరారు.

MOST READ 

మరిన్ని వార్తలు