Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

డ్రగ్స్ మాఫియా కట్టడిలో కానిస్టేబుల్ షకీల్ విశేష ప్రతిభ.. రాష్ట్రస్థాయిలో బెస్ట్ అవార్డు..!

డ్రగ్స్ మాఫియా కస్టడీలో ఓ కానిస్టేబుల్ విశేష ప్రతిభ చూపారు. అందుకుగాను అతడికి రాష్ట్రస్థాయిలో బెస్ట్ అవార్డు దక్కింది.

డ్రగ్స్ మాఫియా కట్టడిలో కానిస్టేబుల్ షకీల్ విశేష ప్రతిభ.. రాష్ట్రస్థాయిలో బెస్ట్ అవార్డు..!

మన సాక్షి నల్గొండ

డ్రగ్స్ మాఫియా కస్టడీలో ఓ కానిస్టేబుల్ విశేష ప్రతిభ చూపారు. అందుకుగాను అతడికి రాష్ట్రస్థాయిలో బెస్ట్ అవార్డు దక్కింది. వివరాల ప్రకారం.. తెలంగాణలోని నల్లగొండ టూ టౌన్ లో కానిస్టేబుల్‌ మొహమ్మద్ షకీల్ నల్లగొండ జిల్లాలో డ్రగ్స్ మాఫియా కట్టడిలో విశేష ప్రతిభ కనబరిచారు దాంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ కు అరుదైన గుర్తింపు లభించింది.

డ్రగ్స్ సరఫరా, వినియోగంపై నిఘా పెంచి కీలక కేసుల్లో చురుగ్గా మొహమ్మద్ షకీల్ వ్యవహరించారు. దాంతో బెస్ట్ అవార్డును అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ శాండిల్య చేతుల మీదుగా అందుకున్నారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటంలో నల్గొండ పోలీసుల నిఘా కీలకంగా మారిందన్నారు. కానిస్టేబుల్ షకీల్ పనితీరును నల్లగొండ టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై డి.సైదాబాబు అభినందించారు. అవార్డు రావడంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తలు