Hyderabad : వారంతా వృద్ధులే.. చేసేది స్మగ్లింగ్.. హైదరాబాదులో ముఠా అరెస్ట్..!
వృద్ధులంతా ఒక ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్ కు తెర లేపారు. వృద్ధులు అయితే ఎవరికి అనుమానం రాదని వారి ప్రయత్నం. అయినా కూడా హైదరాబాద్ పోలీసులు వారిని అరెస్టు చేసి గుట్టు రట్టు చేశారు.

Hyderabad : వారంతా వృద్ధులే.. చేసేది స్మగ్లింగ్.. హైదరాబాదులో ముఠా అరెస్ట్..!
మన సాక్షి, హైదరాబాద్ :
వృద్ధులంతా ఒక ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్ కు తెర లేపారు. వృద్ధులు అయితే ఎవరికి అనుమానం రాదని వారి ప్రయత్నం. అయినా కూడా హైదరాబాద్ పోలీసులు వారిని అరెస్టు చేసి గుట్టు రట్టు చేశారు. వివరాల ప్రకారం.. భారీగా గంజాయి రవాణా చేస్తూ వృద్ధుల ముఠా అయిదుగురు సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. సిటీ సిసిఎస్ క్రైమ్ బృందం, గాంధీనగర్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పది లక్షల రూపాయల విలువైన 38 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు వృద్ధులతో పాటు ఇద్దరు మహిళలు కూడా ఈ ముఠాలో ఉన్నారు. ప్రధాన సూత్రధారి ఆదేశాల మేరకు వీరు అరకులో గంజాయిని సేకరించి క్యారియర్లుగా పని చేస్తున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన రాజారాం (78) సంతోష్ (65) విజయలక్ష్మి (65) శిల్మిన (36) షీలా దేవి (48) ఈ ఐదుగురు ముఠాను అరెస్ట్ చేశారు.
పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమానం రాకుండా ఉండేందుకు గాను ప్రధాన సూత్రధారి వృద్ధులను, మహిళలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. అరకులో బ్రౌన్ కలర్ కవర్లలో ప్యాక్ చేసిన ఎండు గంజాయిని వీరికి అప్పగించేవారు. నిందితులు ఆ గంజాయి పొట్లాలను తమ సాధారణ ప్రయాణ లగేజీ బ్యాగులలో ఎవరికి అనుమానం రాకుండా దాచిపెట్టుకొని రవాణా చేసేవారు. వీరికి గతంలో కూడా ఇలాగే గంజాయిని స్మగ్లింగ్ చేసిన నేర చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
బస్సులలో ప్రయాణం :
ఈ ముఠా సభ్యులు గంజాయిని తరలించేటప్పుడు ఐదుగురు కూడా ఒకే బస్సులో కాకుండా వేరు వేరు బస్సులో హైదరాబాద్ కు బయలుదేరేవారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక రోజు పాటు వేర్వేరు లాడ్జిలలో బస చేసేవారు. ఆ తర్వాత వేర్వేరు బస్సుల్లో ముంబైకి పయనమై ప్రధాన సూత్రధారి చెప్పిన ప్రదేశాలకు పార్సిల్ సురక్షితంగా డెలివరీ చేసేవాళ్లు. ఒక్కో ట్రిప్పుకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల నుంచి 12 వేల రూపాయల వరకు కమిషన్ అందుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
డబ్బులకు ఆశపడి మత్తు పదార్థాల వక్రమ రవాణాలో క్యారియర్లుగా మారొద్దని హైదరాబాద్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ ఆపరేషన్ అడిషనల్ సిపిఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు డిసిపి చైతన్యకుమార్ పర్యవేక్షణలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు సబ్ ఇన్స్పెక్టర్ గౌరేందర్ గౌడ్ విజయవంతంగా పూర్తి చేశారు.
MOST READ
- Hyderabad : 50 గజాలు.. ఏడు అంతస్తులు.. పేక మేడలా కూలిన భవనం.. హైదరాబాదులో ఘటన..!
- Srisailam : శ్రీశైలం జలాశయానికి 50,161 క్యూసెక్కుల నీటి రాక.. దిగువకు నీటి విడుదల..!
- Miryalaguda : ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య దుర్మార్గమైన చర్య.. ట్రాస్మా అద్వర్యంలో ర్యాలీ..!
- Nalgonda : నాగార్జునసాగర్ ఎండుతుంటే పోతిరెడ్డిపాడుకు నీటి విడుదల ఎలా.. రోడ్డెక్కిన రైతులు..!









