ACB : రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన ఎస్సై, కానిస్టేబుల్..!
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్ఐ, కానిస్టేబుల్ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. హైదరాబాద్ కు చెందిన కేసు దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరించి ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు గాను హైదరాబాద్ కి చెందిన చందానగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బండిల బాలరాజు కానిస్టేబుల్ రాఘవేంద్ర అవినీతి అధికారులకు చిక్కారు.

ACB : రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన ఎస్సై, కానిస్టేబుల్..!
మన సాక్షి, హైదరాబాద్ :
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్ఐ, కానిస్టేబుల్ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. హైదరాబాద్ కు చెందిన కేసు దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరించి ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు గాను హైదరాబాద్ కి చెందిన చందానగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బండిల బాలరాజు కానిస్టేబుల్ రాఘవేంద్ర అవినీతి అధికారులకు చిక్కారు.
ఫిర్యాదుదారుడు నుంచి 75 వేల రూపాయల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు దాడి చేసి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కార్యాలయంలోని ఆయన టేబుల్ డ్రా నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అంతకుముందే ఎస్సై 20000 రూపాయలు, కానిస్టేబుల్ రాఘవేంద్ర 10 వేల రూపాయల నగదును డిజిటల్ చెల్లింపుల ద్వారా స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.
తమ అధికారిక విధులను పక్కనపెట్టి అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించిన వీరిద్దరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరు పరిచనున్నట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
MOST READ
- Srisailam : శ్రీశైలం జలాశయానికి 50,161 క్యూసెక్కుల నీటి రాక.. దిగువకు నీటి విడుదల..!
- Madgulapalli : మాడ్గులపల్లిలో అద్దె ఇంటి కోసం వచ్చి.. మంగళసూత్రంతో జంప్…!
- Hyderabad : వారంతా వృద్ధులే.. చేసేది స్మగ్లింగ్.. హైదరాబాదులో ముఠా అరెస్ట్..!
- ఏకాంతంగా ఉండేందుకు అడవికి వెళ్ళిన జంట.. చివరికి ఏం జరిగిందంటే..!