Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Madgulapalli : మాడ్గులపల్లిలో అద్దె ఇంటి కోసం వచ్చి.. మంగళసూత్రంతో జంప్…!
ఇల్లు అద్దెకు కావాలని ఇంట్లోకి ప్రవేశించి వృద్దురాలు మెడలో మంగళసూత్రం దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం సాయంత్రం సుమారుగా 6 గంటల సమయంలో నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో జరిగింది.

Madgulapalli : మాడ్గులపల్లిలో అద్దె ఇంటి కోసం వచ్చి.. మంగళసూత్రంతో జంప్…!
మాడుగులపల్లి, మన సాక్షి:
ఇల్లు అద్దెకు కావాలని ఇంట్లోకి ప్రవేశించి వృద్దురాలు మెడలో మంగళసూత్రం దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం సాయంత్రం సుమారుగా 6 గంటల సమయంలో నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో జరిగింది. మాడుగులపల్లి గ్రామానికి చెందిన కుందూరు వసంతమ్మ (70) ఇంటికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇల్లు అద్దెకు కావాలని చెప్పి , ఇల్లు చూస్తానని ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు ఇవ్వమన్నాడు.
ఆమె వంట గదిలోకి వెళ్ళగానే ఆమె మెడలో ఉన్న 3 తులలా మంగళసూత్రం గుంజుకొనగా ఆమె గట్టిగా మంగళసూత్రాన్ని పట్టుకోవడంతో సగం చైన్ తెగగా మిగిలిన బంగారు చైన్ ని తీసుకొని పారిపోయినాడు. మంగళసూత్రం సుమారు తులం నర వరకు ఉండవచ్చు అనే ఫిర్యాదు పై కేసు నమోదు చేసే దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
- Madgulapalli : పది రోజులు మృత్యువుతో పోరాడి.. చివరికి లోకాన్ని విడిచి..!
- Suryapet : సూర్యాపేట జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం.. ఆ కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి డిస్మిస్..!
- మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచి పెట్టాడు.. పోలీసులకు సమాచారం ఇచ్చిన బుడ్డోడు..!
- ఏకాంతంగా ఉండేందుకు అడవికి వెళ్ళిన జంట.. చివరికి ఏం జరిగిందంటే..!









