Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Madgulapalli : పది రోజులు మృత్యువుతో పోరాడి.. చివరికి లోకాన్ని విడిచి..! 

కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన మహిళ వంటి పైన పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని పది రోజులు మృత్యువుతో పోరాడి చివరికి లోకాన్ని విడిచిన ఘటన మాడుగులపల్లి మండలం కల్వలపాలెం గ్రామంలో చోటు చేసుకుంది.

Madgulapalli : పది రోజులు మృత్యువుతో పోరాడి.. చివరికి లోకాన్ని విడిచి..! 

మాడుగుల పల్లి, మన సాక్షి :

కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన మహిళ వంటి పైన పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని పది రోజులు మృత్యువుతో పోరాడి చివరికి లోకాన్ని విడిచిన ఘటన మాడుగులపల్లి మండలం కల్వలపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాంపల్లి సులోచన వెంకన్న దంపతులకు వివాహమై 22 సంవత్సరాలు వీరికి ఇద్దరు కుమారులు కూలి, వినాలి చేసుకుంటూ కుమారులను చదివించుకుంటూ జీవనం గడుపుతున్నారు.

కుమారులు చదువుపై శ్రద్ధ చూపకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితి వలన మనస్థాపానికి గురై నాంపల్లి సులోచన ఈనెల పదవ తారీకున బాత్రూంలోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని కేకలు వేస్తుండగా తన భర్త తన కుమారుడు ఇద్దరు మంటలు ఆర్పి అంబులెన్స్ ద్వారా నల్గొండ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్ సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అదే రోజు రాత్రి నల్గొండ లోని ప్రైవేట్ ఆసుపత్రి అయిన స్కంద లైఫ్ లైన్ ఆసుపత్రిలో చేర్పించారు.

పది రోజుల తర్వాత చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించటంతో మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అని మృతురాలి తమ్ముడైన వెంకటగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. మా అక్క మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని ఫిర్యాదులో పేర్కొన్నారు.

MOST READ

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు