Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

గుర్రంపోడు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గంగుల కృష్ణ..!

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు గంగుల కృష్ణ ఎన్నికయ్యారు. శుక్రవారం మండల కేంద్రంలోని (ఆర్ అండ్ బి) అతిథి గృహంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) జయవీర్ రెడ్డి సమక్షంలో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

గుర్రంపోడు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గంగుల కృష్ణ..!

గుర్రంపోడు, మన సాక్షి :

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు గంగుల కృష్ణ ఎన్నికయ్యారు. శుక్రవారం మండల కేంద్రంలోని (ఆర్ అండ్ బి) అతిథి గృహంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) జయవీర్ రెడ్డి సమక్షంలో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గంగుల కృష్ణను మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా అధికారికంగా ప్రకటించారు.

అనంతరం ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన గంగుల కృష్ణకు అభినందనలు తెలిపారు. మండలంలోని గ్రామాలను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి మరియు గ్రామాల బలోపేతానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గంగుల కృష్ణ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా తిరిగి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డికి, మండలంలోని సర్పంచులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అందరినీ కలుపుకుంటూ మండలంలోని అన్ని గ్రామాల సమస్యల పరిష్కారానికి, గ్రామాల సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు మండల నాయకులు, సర్పంచులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు