తెలుగు రాష్ట్రాలలో ఈడి సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో తనిఖీలు..!
తెలుగు రాష్ట్రాలలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ఈడి) అధికారులు మరోసారి సోదాలు చేపట్టారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా పలు ప్రాంతాలలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలో ఈడి సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో తనిఖీలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాలలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ఈడి) అధికారులు మరోసారి సోదాలు చేపట్టారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా పలు ప్రాంతాలలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం పది ప్రాంతాలలో ఈడి అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. కడప, హైదరాబాద్ ప్రాంతాలలో ప్రముఖులు, వ్యక్తులకు సంబంధించిన నివాసాలు ఇతర ప్రాంతాలలో కూడా ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.
హైదరాబాదులోని కోకాపేటలో ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విల్లాలోని ఈడి అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాలు చేపడుతున్న సమయంలో అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి, దస్తగిరి నివాసాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలపై సోదాలు చేపడుతున్నట్లు సమాచారం. ఏపీలో నాలుగు ప్రాంతాల్లో హైదరాబాదులో ఆరు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపడుతున్నారు.
ALSO READ
- సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
- Miryalaguda : నానో యూరియా, నానో డీఏపీ ఎలా వినియోగించాలో తెలుసుకుందాం..!
- Paddy : రైతులు అలా చేస్తేనే సన్న వడ్లకు ప్రభుత్వ బోనస్..!
- Nalgonda : ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో కీలక మలుపు తిప్పిన ఒకే ఒక్క పదం.. హత్యకు పథకం ఎలా వేశారంటే..!
- Viral : అన్నయ్య అనే పిలుపు కోసం ఎదురుచూస్తున్న బ్రహ్మానందం తోబుట్టు..!









