Miryalaguda : నానో యూరియా, నానో డీఏపీ ఎలా వినియోగించాలో తెలుసుకుందాం..!
మిర్యాలగూడ మండలంలో ఆత్మ ఆధ్వర్యంలో బుధవారం చింతపల్లి, కిష్టపురం గ్రామాల్లో డెమాన్స్ట్రేషన్లు, రైతు అవగాహన సమావేశాలు నిర్వహించడం జరిగింది.

Miryalaguda : నానో యూరియా, నానో డీఏపీ ఎలా వినియోగించాలో తెలుసుకుందాం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ మండలంలో ఆత్మ ఆధ్వర్యంలో బుధవారం చింతపల్లి, కిష్టపురం గ్రామాల్లో డెమాన్స్ట్రేషన్లు, రైతు అవగాహన సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో రైతులకు నానో యూరియా, నానో డీఏపీ వినియోగ విధానం, ప్రయోజనాలు, సమీకృత తెగులు నిర్వహణ పై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు.
నానో యూరియా, నానో డీఏపీలు ద్రవ రూపంలో లభించే ఆధునిక నానో ఎరువులని, పంట అవసరాన్ని బట్టి సిఫారసు చేసిన మోతాదులో నీటిలో కలిపి ఆకులపై పిచికారీ చేయడం ద్వారా మొక్కలకు పోషకాలు అందించవచ్చని అధికారులు వివరించారు. పంట ఎదుగుదల దశలో, అలాగే పూత/పిందె దశలో ఆకుల పైభాగం మరియు క్రింది భాగం తడిసేలా పిచికారీ చేయాలని సూచించారు.
వీటి వినియోగం ద్వారా పోషకాల సమర్థ వినియోగం, రవాణా మరియు నిల్వలో సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. సమీకృత తెగులు నిర్వహణలో రసాయన పురుగుమందులపై పూర్తిగా ఆధారపడకుండా జీవ, యాంత్రిక ఇతర పద్ధతులను సమన్వయం చేసుకుని తెగుళ్లను నియంత్రించవచ్చని రైతులకు వివరించారు.
దీని ద్వారా పురుగుమందుల వినియోగం, సాగు ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, మిత్ర పురుగుల సంరక్షణ, పురుగుమందుల నిరోధకత ఏర్పడకుండా నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రుషేంద్రమని, ఏఈఓ పార్వతి, బీటీఎం గిరి, రవి, నాగరాజు, కృష్ణారెడ్డి, లింగనాయక్, రవి, రంగారెడ్డి తదితరులు పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.










