Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
నల్గొండ జిల్లా కుక్కడంలో కలకలం.. గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహం..!
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని కుక్కడం గ్రామ శివారులోని కబ్రస్తాన్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.

నల్గొండ జిల్లా కుక్కడంలో కలకలం.. గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహం..!
మాడుగులపల్లి, మన సాక్షి:
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని కుక్కడం గ్రామ శివారులోని కబ్రస్తాన్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడి వివరాలు, అతడు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే సమాచారం ప్రస్తుతానికి తెలియరాలేదు.
మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మృత దేహం గుర్తింపు, మృతికి గల కారణాలపై దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read :
నల్గొండ జిల్లా కుక్కడంలో కలకలం.. గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహం..!









