Karimnagar : 22ఏ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి.. బీజేపీ డిమాండ్..!
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 22ఏ (నిషేధిత భూములు) జాబితా అక్రమాలు, అవకతవకలపై, వేలాది మంది రైతులు, భూ యజమానుల ఆస్తి హక్కులను కాలరాస్తున్న భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకొని, ఈ తప్పిదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం డిమాండ్ చేశారు.

Karimnagar : 22ఏ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి.. బీజేపీ డిమాండ్..!
కరీంనగర్, మనసాక్షి :
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 22ఏ (నిషేధిత భూములు) జాబితా అక్రమాలు, అవకతవకలపై, వేలాది మంది రైతులు, భూ యజమానుల ఆస్తి హక్కులను కాలరాస్తున్న భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకొని, ఈ తప్పిదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో బిజెపి శ్రేణులతో కలిసి ఉన్నత అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ 22ఏ నిషేధిత భూముల జాబితాలో జరిగిన భారీ అవకతవకలను కేవలం పరిపాలనా తప్పిదంగా కాకుండా, ఒక వ్యవస్థీకృత కుట్రగా పరిగణించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వేలాది మంది భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఈ భారీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి కుటుంబ కంపెనీకి, ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి వేల కోట్ల విలువైన ప్రాపర్టీస్ బదిలీ అయిన ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాలని తెలిపారు.
ధరణి భూభారతి పోర్టల్స్‌లో గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు జరిగిన మార్పులు, చేర్పులపై డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్నారు. కరీంనగర్ జిల్లాలోని 22ఏ భూముల వివరాలను మండలం, గ్రామం, సర్వే నంబర్ల వారీగా బహిర్గతం చేసి పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. తప్పుగా నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేటు, పట్టా భూములను వెంటనే తొలగించి, బాధితులకు న్యాయం చేయడానికి ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం ఏర్పాటు చేయాలన్నారు
రికార్డులను ఉద్దేశపూర్వకంగా మార్చిన అధికారులు, మధ్యవర్తుల పాత్రపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ద్వారా బీజేపీ లేవనెత్తిన డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, సమస్య పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టకపోతే రైతుల తరఫున పోరాటం ఉధృతం చేస్తామని సాయిని మల్లేశం ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ కోలగాని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడవెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, రంగు భాస్కరాచారి, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, బి జె వై ఎం జిల్లా అధ్యక్షులు సంఘ నరేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మోతే గంగారెడ్డి, కార్పొరేటర్ ఏ .పి.పి. చంద్ర, ఎన్నం ప్రకాష్, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, నాంపల్లి శ్రీనివాస్, అడిచర్ల రాజు, ముత్యాల జగన్ రెడ్డి, గుంజేటి శివ,
జగదీశ్వరాచారి, వాసు, సుధాకర్ పటేల్, కార్పొరేటర్ కె. పి. చంద్ర, ఎన్నం ప్రకాష్ , మండల, జోన్ అధ్యక్షులు పాదం శివరాజ్, అవదుర్తి శ్రీనివాస్, కుంట తిరుపతి, కంది రాజిరెడ్డి, చింతం శ్రీనివాస్, మడి షెట్టి సంతోష్ కచకాయల రాజు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









