Srisailam : శ్రీశైలం జలాశయానికి 50,161 క్యూసెక్కుల నీటి రాక.. దిగువకు నీటి విడుదల..!
శ్రీశైలం జలాశయానికి వరదనీటి రాక క్రమంగా పెరుగుతుంది. కృష్ణా నది ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలతో పాటు జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి నీటిని విడుదల చేయడం వల్ల శ్రీశైలం జలాశయానికి నీటి రాక పెరుగుతుంది.

Srisailam : శ్రీశైలం జలాశయానికి 50,161 క్యూసెక్కుల నీటి రాక.. దిగువకు నీటి విడుదల..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో:
శ్రీశైలం జలాశయానికి వరదనీటి రాక క్రమంగా పెరుగుతుంది. కృష్ణా నది ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలతో పాటు జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి నీటిని విడుదల చేయడం వల్ల శ్రీశైలం జలాశయానికి నీటి రాక పెరుగుతుంది. జూరాల విద్యుత్ కేంద్రం నుంచి 45, 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం జలాశయానికి 50వేల 161 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.
శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 875.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 167.48 టీఎంసీల నీరు ఉన్నది. శ్రీశైలం గుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో 28, 252 క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి అయ్యాక దిగువకు విడుదల చేస్తున్నారు.









