Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

సెప్టెంబర్ 1న పేటలో యోగాసన పోటీలు.. వివరాలు ఇవే..!

నారాయణపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1 సెప్టెంబర్ మంగళవారం యోగాసన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

సెప్టెంబర్ 1న పేటలో యోగాసన పోటీలు.. వివరాలు ఇవే..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1 సెప్టెంబర్ మంగళవారం యోగాసన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు సిటిజన్స్ క్లబ్ యోగా సెంటర్ నారాయణపేట నందు యోగాసన పోటీలు ఏర్పాటు చేసినట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎం. అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కలకొండ ప్రవీణ్ తెలిపారు.

ఈ యోగా పోటీలు సబ్ జూనియర్స్ (10-14),జూనియర్స్ (14-18), సీనియర్స్ (18-28),సీనియర్స్ (28-35) ఏ, సీనియర్స్ (35-45) బి , సీనియర్స్ (45-55)సి గ్రూపులలో బాలురు, బాలికలకు వేరువేరుగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ పోటీలలో ట్రెడిషనల్, ఆర్టిస్టిక్
సింగిల్ పేయర్ రిథమిక్ లలో యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

ఆసక్తిగల యోగా క్రీడాకారులు ఆధార్ కార్డు బోనఫైడ్ లతో హాజరు కావాలని 1 మార్చ్ 2026 నాటికి వయసు ఆధారంగా నిర్ణయిస్తున్నట్లు వారు తెలిపారు. మిగతా వివరాలకు 9963345401,9440291672 గల సెల్ ఫోన్ లకు సంప్రదించాలని వారు కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తలు