ఎంతకు తెగించింది.. కన్న తండ్రిని చంపేంత ప్రేమ మొహం..!
ప్రేమ వ్యవహారాన్ని తండ్రి వ్యతిరేకించాడని, ప్రియుడితో ఏకాంతంగా ఉండటం చూశాడని తండ్రిని శవంగా మార్చి కాలువలో పడేసిన ఘోర ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ఎంతకు తెగించింది.. కన్న తండ్రిని చంపేంత ప్రేమ మొహం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ప్రేమ వ్యవహారాన్ని తండ్రి వ్యతిరేకించాడని, ప్రియుడితో ఏకాంతంగా ఉండటం చూశాడని తండ్రిని శవంగా మార్చి కాలువలో పడేసిన ఘోర ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో కన్న కూతురు తన ప్రియుడితో కలిసి తండ్రిని దారుణంగా హత్య చేసింది.
చావని పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్ వాపూర్ గ్రామానికి చెందిన కృష్ణ (52) అని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆయనకు 17 సంవత్సరాల మైనర్ కుమార్తె ఉంది. ఆమె పక్క గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడితో రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రేమను కృష్ణ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఆగస్టు 21వ తేదీన కృష్ణ మేకలను మేపేందుకు అడవికి వెళ్ళిన సమయంలో చెరుకు తోట సమీపంలో తన కుమార్తె లక్ష్మణ్ తో ఏకాంతంగా ఉండడాన్ని ప్రత్యక్షంగా చూశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురై వారిద్దరిని మందలించాడు. ఈ సమయంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఇద్దరు కలిసి కృష్ణ పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ
- Hyderabad : వారంతా వృద్ధులే.. చేసేది స్మగ్లింగ్.. హైదరాబాదులో ముఠా అరెస్ట్..!
- Hyderabad : 50 గజాలు.. ఏడు అంతస్తులు.. పేక మేడలా కూలిన భవనం.. హైదరాబాదులో ఘటన..!
- Suryapet : సూర్యాపేట జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం.. ఆ కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి డిస్మిస్..!
- Miryalaguda : ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య దుర్మార్గమైన చర్య.. ట్రాస్మా అద్వర్యంలో ర్యాలీ..!









