గుప్త నిధుల కోసం తవ్వకాలు.. ముగ్గురు అరెస్ట్..!
గుప్త నిధుల తవ్వకాల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్దండ ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు.

గుప్త నిధుల కోసం తవ్వకాలు.. ముగ్గురు అరెస్ట్..!
వెల్దండ ఆగస్టు 23 (మన సాక్షి):
గుప్త నిధుల తవ్వకాల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్దండ ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం రాచూరు తండా సమీపంలో కొంతమంది వ్యక్తులు గుప్త నిధులు తవ్వకానికి పాల్పడుతున్నట్లు శనివారం రాత్రి ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెళ్లి పరిశీలించగా ఒక జెసిబి, ద్విచక్ర వాహనాన్ని, ముగ్గురు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఆ ముగ్గురు వ్యక్తుల వివరాలు ఇలా ఉన్నాయి.. గుత్తి సత్యనారాయణ (40) రాచూరు గ్రామం, కేతావత్ శంకర్ (34) హరియా నాయక్ తండ, కేసారపు శ్రీశైలం (25) జెసిబి డ్రైవర్ వెల్దండ గ్రామం అనే ముగ్గురు వ్యక్తులు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ గుప్త నిధుల తవ్వకాలలో పట్టుబడిన జెసిబి టీజీ 06బీ 1171, టీఎస్ 07 జిబి 8362 (హోండా షైన్) వాహనాలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా కొంతమంది పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.









