Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో ఇంట్లోనే పేకాట అడ్డా.. పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్టు..!
మిర్యాలగూడ వన్ టౌన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

Miryalaguda : మిర్యాలగూడలో ఇంట్లోనే పేకాట అడ్డా.. పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్టు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. మిర్యాలగూడ ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్ నాగభూషణ రావు ఆదేశాల మేరకు ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ సిబ్బందితో మిర్యాలగూడ టౌన్ బాపూజీ నగర్ లోని సకినాల ప్రదీప్ ఇంట్లో పేకాట ఆడుతున్న సమాచారం దాడులు నిర్వహించారు.
అక్కడ ఏడుగురు వ్యక్తులు సకినాల ప్రదీప్, బొంత సతీష్, మాదాని ఆకాష్, కుంచం సైదులు, పండగ చైతన్య, జోగునూరు నరేష్, తుర్క వెంకటేష్ డబ్బులు బెట్టింగ్ పెట్టి అందరు బాహర్ మూడుముక్కల పేకాట ఆడుతున్నారు. ఇట్టి ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 7100 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.









