Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

కాంగ్రెస్‌ హయాంలోనే పేదల సొంతింటి కల సాకారం.. రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి..!

కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు పోతు భాస్కర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ హయాంలోనే పేదల సొంతింటి కల సాకారం.. రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి..!

సూర్యాపేట, మనసాక్షి

కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు పోతు భాస్కర్‌ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 11వ వార్డు రాయినిగూడెం లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ALSO READBoxing : బాక్సింగ్ పోటీల్లో సెయింట్ జాన్స్ హై స్కూల్ విద్యార్థినికి రజత పతకం..!

తన తదనంతరం కాంగ్రెస్‌ కార్యాలయానికి ఇంటి స్థలం

కొనతం వెంకట్‌రెడ్డి తన తదనంతరం తనకు చెందిన 330 గజాల ఇంటి స్థలాన్ని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి అందజేస్తానని ప్రకటించడం అభినందనీయమని వారు అన్నారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, చినుముల సునీల్ రెడ్డి, దండు మైసమ్మ దేవాలయ చైర్మన్ తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి చింతమల్ల రమేష్, మాజీ కౌన్సిలర్, వార్డు ఇన్‌చార్జి ఎడ్ల గంగాభవాని వీరమల్లు యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు నంద్యాల మహేష్‌రెడ్డి, నంద్యాల కిషోర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, నంద్యాల వెంకటరెడ్డి, కొప్పుల వెంకటరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి,

లింగయ్య, నంద్యాల కృష్ణారెడ్డి, రమేష్‌, ఏల్గూరి వెంకటేశం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉప్పునూతల వెంకన్న, మల్లమ్మ, తరుణ్‌కుమార్‌, త్రిష, రావుల రేణుక, మహేష్‌, హారిక, స్వరూప, ఉదయ్‌ కుమార్‌రెడ్డి, రితిక తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు