Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

క్రైమ్ పారా మీటర్ల అమలులో నల్గొండ జిల్లా పోలీసుల ఉత్తమ ప్రతిభ..!

రాష్ట్ర స్థాయిలో క్రైమ్ పారా మీటర్ల అమలు, పోలీస్ శాఖ పనితీరుకు సంబంధించి నిర్వహించిన సమీక్షలో నల్లగొండ జిల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచింది.

క్రైమ్ పారా మీటర్ల అమలులో నల్గొండ జిల్లా పోలీసుల ఉత్తమ ప్రతిభ..!

– 8 అంశాల్లో సమగ్ర పనితీరుతో క్లస్టర్-3లో నల్లగొండకు అగ్రస్థానం

నల్లగొండ, మన సాక్షి;

రాష్ట్ర స్థాయిలో క్రైమ్ పారా మీటర్ల అమలు, పోలీస్ శాఖ పనితీరుకు సంబంధించి నిర్వహించిన సమీక్షలో నల్లగొండ జిల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచింది. రాష్ట్రంలోని వివిధ పోలీస్ యూనిట్ల పనితీరును సమీక్షించిన అధికారులు, 8 కీలక అంశాల్లో సమగ్ర పనితీరు ఆధారంగా నల్లగొండ జిల్లాను క్లస్టర్-3లో అగ్రస్థానంలో నిలిపారు.

ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కి శనివారం డీజీపీ సీ.వీ ఆనంద్ ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సమష్టి కృషి, అంకితభావంతో ఉత్తమ ఫలితాలు సాధించడంపై డీజీపీ ప్రశంసలు తెలిపారు..

ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మరింత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ, అన్ని రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీజీపీ జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచించారు.నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ సాధించిన ఈ విజయం పై జిల్లా ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు.

MOST VIEWS : 

మరిన్ని వార్తలు