అదనపు కలెక్టర్ కీలక సూచన.. వర్షపు నీటిని నిల్వ చేయాలి..!
మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం పరిధిలోని రాంసింగ్ తండాలో కుంట సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం పర్యటించారు.

అదనపు కలెక్టర్ కీలక సూచన.. వర్షపు నీటిని నిల్వ చేయాలి..!
మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి, మన సాక్షి :
మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం పరిధిలోని రాంసింగ్ తండాలో కుంట సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా తండా పరిధిలో నిర్మించిన వ్యవసాయ కుంటలను ఆయన స్వయంగా పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… రైతులు తమ వ్యవసాయ భూముల్లో తప్పనిసరిగా వ్యవసాయ కుంటలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా నీటి సంరక్షణతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన తెలిపారు.
పంటల సాగు సమయాల్లో లేదా వర్షాభావ (ఎండల) పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ నీరు నీటిపారుదలకు ఎంతో ఉపయోగపడుతుందని, దీనివల్ల పంట దిగుబడి పెరిగి రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని తెలియజేశారూ.
అనంతరం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ రైతులతో కలిసి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు రైతులు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో, జయరాం నాయక్, ఏపీవో జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ పాండురాజు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
MOST READ
- Karimnagar : రాఖీ పండుగ వేళ.. ప్రయాణికుల రద్దీపై ఆర్టీసీ ప్రత్యేక నిఘా..!
- Miryalaguda : మిర్యాలగూడలో రైస్ మిల్లుల మాటున రేషన్ దందా.. రీసైక్లింగ్ జరుగుతున్నాయి జర జాగ్రత్త..!
- Suryapet : వాహన యజమానులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ సీరియస్ హెచ్చరిక.. ఆ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..!
- Mahabubnagar : ఓటర్ నమోదుకు అదనపు కలెక్టర్ హరిప్రియ సూచనలు..!










