సాగర్ లో ఏపీ జల దోపిడీ.. కుడి కాలువ ద్వారా భారీగా నీటి విడుదల..!
ఆంధ్రప్రదేశ్ జల దోపిడీ కొనసాగిస్తుంది. కృష్ణానది జలాల వాటా ప్రకారం కాకుండా అడ్డగోలుగా నీటిని విడుదల చేస్తోంది.

సాగర్ లో ఏపీ జల దోపిడీ.. కుడి కాలువ ద్వారా భారీగా నీటి విడుదల..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఆంధ్రప్రదేశ్ జల దోపిడీ కొనసాగిస్తుంది. కృష్ణానది జలాల వాటా ప్రకారం కాకుండా అడ్డగోలుగా నీటిని విడుదల చేస్తోంది. నాగార్జునసాగర్ జలాశయంలో ప్రస్తుతం 531 అడుగుల నీరు ఉన్నప్పుడు తాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాలువలకు అధికారులు నీటిని విడుదల చేశారు. కాగా ఎడమ కాలువకు కేవలం 2067 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు కుడికాలువకు మాత్రం 7381 కేసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఎడమ కాలువకు కేవలం నల్గొండ జిల్లా త్రిపురారం వద్ద ఉన్న పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ నింపేందుకు మాత్రమే నీటిని విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 7381 క్యూసెక్కులకు పైగా కుడికాలువకు నీటిని విడుదల చేస్తూ జలదోపిడిని యదేచ్చగా కొనసాగిస్తుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ సాగర్ లో ఉన్న నీటిని తరలించుకు పోతుంది. అంతేకాకుండా శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా నాగార్జునసాగర్ కు రావలసిన వరద నీరును శ్రీశైలం జలాశయం వెనుక ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కూడా నీటిని తరలిస్తుంది. దాంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ తగ్గుదల కనిపిస్తుంది.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో బోర్లు బావుల కింద కొంతమేరకు వరి సాగు చేసిన రైతులు పంటలు ఎండిపోతూ కష్టాలు పడుతున్నారు. బోర్లు, బావులు ఎండిపోయి నీరు లేక పంటలు కూడా ఎండిపోతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం చెరువులు నింపేందుకు కూడా నీటిని విడుదల చేయడం లేదు. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే రెండువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చెరువులు నింపాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం ఏపీ జలదోపిడిని అడ్డుకోకపోవడంతో పాటు చెరువులను నింపేందుకు ఎడమ కాలువకు నీటిని కూడా విడుదల చేయడం లేదు.
MOST READ
- Miryalaguda : మిర్యాలగూడలో రైస్ మిల్లుల మాటున రేషన్ దందా.. రీసైక్లింగ్ జరుగుతున్నాయి జర జాగ్రత్త..!
- Mahabubnagar : ఓటర్ నమోదుకు అదనపు కలెక్టర్ హరిప్రియ సూచనలు..!
- Narayanpet : నారాయణపేట జిల్లాలో దారుణం.. కన్న కొడుకు ముందే తల్లిపై లైంగిక దాడి..!
- Cyber : ఇప్పుడు సరికొత్త హైబ్రిడ్ సైబర్ మోసం.. ఎలా చేస్తారంటే.. అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచన..!









