Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : నారాయణపేట జిల్లాలో దారుణం.. కన్న కొడుకు ముందే తల్లిపై లైంగిక దాడి..!

నారాయణపేట జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. కన్న కొడుకు ముందే లైంగిక దాడి చేసి ఆ మహిళ ప్రైవేట్ పార్ట్స్ ను కోసేసిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Narayanpet : నారాయణపేట జిల్లాలో దారుణం.. కన్న కొడుకు ముందే తల్లిపై లైంగిక దాడి..!

మన సాక్షి, నారాయణపేట :

నారాయణపేట జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. కన్న కొడుకు ముందే లైంగిక దాడి చేసి ఆ మహిళ ప్రైవేట్ పార్ట్స్ ను కోసేసిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన ఓ మహిళ గత కొన్ని సంవత్సరాల నుండి ఒంటరిగా తన 12 సంవత్సరాల కొడుకుతో జీవనం సాగిస్తుంది. జీవనోపాధి కోసం ఆ మహిళా పట్టణంలోని ఓ ప్రధాన కూడలితో పాటు బస్టాండ్ లో భిక్షాటన చేస్తూ జీవిస్తుంది . రాత్రిపూట మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం వద్ద తలదాచుకుంటుంది.

అయితే ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిద్రిస్తున్న తల్లి కొడుకుల దగ్గరకు వెళ్లి తల్లి పై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో తల్లి కేకలు వేయడంతో నిద్రిస్తున్న కుమారుడు లేచాడు. తల్లి పై దాడికి దిగిన ఇద్దరు వ్యక్తులను అడ్డుకునే ప్రయత్నం చేసినా మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరు పిల్లవాడిపై దాడికి దిగారు. దాంతో ఆ చిన్న పిల్లవాడు భయంతో పరుగులు తీశాడు.

గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఆ మహిళపై విచక్షణ రహితంగా లైంగిక దాడికి పాల్పడి అనంతరం మహిళ ప్రైవేట్ పార్ట్స్ కోసేసి వెళ్ళిపోయారు. కాగా మహిళ రక్తపు మడుగులో పడిపోయిన దృశ్యాలు తెల్లవారు జామున మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్ లో వాకింగ్ కు వచ్చిన పలువురు గమనించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. కాగా మక్తల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు