Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Big Breaking : శ్రీశైలంలో తీవ్ర విషాదం.. ప్రైవేటు సత్రంలో ఐదుగురు ఆత్మహత్య..!

శ్రీశైలం పుణ్యక్షేత్రం వద్ద తీవ్ర విషాద ఘటన నెలకొన్నది. అక్కడ ప్రైవేట్ సత్రంలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Big Breaking : శ్రీశైలంలో తీవ్ర విషాదం.. ప్రైవేటు సత్రంలో ఐదుగురు ఆత్మహత్య..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

శ్రీశైలం పుణ్యక్షేత్రం వద్ద తీవ్ర విషాద ఘటన నెలకొన్నది. అక్కడ ప్రైవేట్ సత్రంలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీశైలంలోని వడ్డెర అన్నదాన సత్రంలో రూమ్ నెంబర్ 11 లో ఈ ఘటన జరిగింది.  ముగ్గురు మహిళలు ఒక పురుషుడుతో పాటు 15 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. రెండు మూడు రోజులుగా గది తలుపులు తీయకుండా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆత్మకూరు డిఎస్పి రామాంజి ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని తలుపులు తెరిచి పరిశీలించారు.

కాగా గదిలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో మృతులు ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45) సుధాకర్ (36), శ్రీదేవి(33) మణికంఠ (15) గా గుర్తించారు. కాగా ప్రాథమిక దర్యాప్తులో మృతులు సత్యసాయి జిల్లా బత్తలపాలెం వాసులుగా గుర్తించారు. ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక కారణాలు ఉండవచ్చునని భావిస్తున్నారు.

MOST READ

మరిన్ని వార్తలు