Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్
ఐదవ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య.. అసలు కారణం ఏంటి..?
హైదరాబాదులోని కెపిహెచ్ బి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కెపిహెచ్బి కాలనీలో ఐదవ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది.

ఐదవ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య.. అసలు కారణం ఏంటి..?
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాదులోని కెపిహెచ్ బి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కెపిహెచ్బి కాలనీలో ఐదవ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో 6వ ఫేజ్ లోని పంచమతి అపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగింది. అపార్ట్మెంట్లో 5 వ అంతస్థు నుంచి మహిళ దూకి సీత పురుషోత్తం (30) ఆత్మహత్య చేసుకోగా అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె డిప్రెషన్ కు సంబంధించిన మందులు వాడుతున్నట్లు సమాచారం. ఘటనపై కేపిహెచ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ









