Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

ఆక్రమణకు చెక్.. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన షెడ్డు కూల్చివేత..!

అన్నమయ్య జిల్లా మండలంలోని ఆర్. నడింపల్లె గ్రామ పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించి, గ్రామ పొలిమేరలకు ప్రజలు వెళ్లే దారికి అడ్డంగా రాత్రికి రాత్రే షెడ్డు నిర్మించాడు.

ఆక్రమణకు చెక్.. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన షెడ్డు కూల్చివేత..!

రామసముద్రం, మనసాక్షి:

అన్నమయ్య జిల్లా మండలంలోని ఆర్. నడింపల్లె గ్రామ పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించి, గ్రామ పొలిమేరలకు ప్రజలు వెళ్లే దారికి అడ్డంగా రాత్రికి రాత్రే షెడ్డు నిర్మించాడు. షెడ్డు తొలగించాలని గ్రామస్థులు పలుమార్లు కోరినా పట్టించుకోకపోవడంతో తాహిసీల్దార్ మహమ్మద్ అజారుద్దీన్ కు ఫిర్యాదు చేశారు.స్థలాన్ని పరిశీలించిన తహశీల్దార్ షెడ్డు తొలగించాలని సూచించినా స్పందించకపోవడంతో సి ఐ రవి నాయక్, ఎస్సై హృషికేశవ రెడ్డి పోలీస్ సిబ్బంది సహకారంతోసోమవారం అధికారులు బుల్డోజర్ తో షెడ్డును నేలమట్టం చేశారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు