Miryalaguda : వర్షాలు కురవాలని మిర్యాలగూడలో వరుణ యాగం..!
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం (శివాలయం) లో మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో సహస్ర పట్టాభిషేకం (వరుణ యాగం) నిర్వహించారు.

Miryalaguda : వర్షాలు కురవాలని మిర్యాలగూడలో వరుణ యాగం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం (శివాలయం) లో మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో సహస్ర పట్టాభిషేకం (వరుణ యాగం) నిర్వహించారు. యాగంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సహస్ర పట్టాభిషేకంలో పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని, వ్యవసాయానికి అవసరమైన నీరు సమృద్ధిగా లభించి రైతులు పండించిన పంటలకు మంచి దిగుబడులు రావాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. ప్రకృతి అనుకూలించి సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పొలాలు పచ్చని పంటలతో కళకళలాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ










