Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

ఓకే గ్రామం.. రెండు పంచాయతీలు, రెండు మండలాలు.. తెలంగాణలో ఈ విచిత్ర గ్రామం..! 

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో విచిత్ర గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామం రెండు గ్రామ పంచాయతీల పరిధిలో ఉండడంతో పాటు మండలాలు కూడా రెండు ఉన్నాయి. ఆ గ్రామస్తులు ఏదైనా పనికి వెళ్లాలంటే ఏ మండలం వెళ్లాలో ఏ గ్రామపంచాయతీలో పనులు చేయించుకోవాలో అర్థం కావడం లేదు..

ఓకే గ్రామం.. రెండు పంచాయతీలు, రెండు మండలాలు.. తెలంగాణలో ఈ విచిత్ర గ్రామం..! 

మన సాక్షి, తుంగతుర్తి :

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో విచిత్ర గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామం రెండు గ్రామ పంచాయతీల పరిధిలో ఉండడంతో పాటు మండలాలు కూడా రెండు ఉన్నాయి. ఆ గ్రామస్తులు ఏదైనా పనికి వెళ్లాలంటే ఏ మండలం వెళ్లాలో ఏ గ్రామపంచాయతీలో పనులు చేయించుకోవాలో అర్థం కావడం లేదు..

సూర్యాపేట జిల్లా నాగారం మండలం కంచుగట్లగూడెం (గొల్లగూడెం) గ్రామంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఏ ఊరిౖకైనా ఒక సర్పంచ్‌… ఒకటే గ్రామపంచాయతీ, ఒకటే మండలం ఉంటుంది. కానీ ఈ గ్రామానికి మాత్రం ఇద్దరు సర్పంచ్‌లు ఉండడం విశేషం. అంతే కాదు.. ఈ పల్లె రెండు పంచాయతీలే కాదు.. రెండు మండలాల పరిధిలో ఉంది. అన్నీ డబుల్‌ డబుల్‌ ఉన్నట్లే సమస్యలు కూడా రెట్టింపు స్థాయిలో ఉన్నాయి.

గ్రామంలో ఇలా :

కంచుగట్లగూడెం గ్రామంలో మొత్తం 50 కుటుంబాలు, 147 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 12 కుటుంబాలను (42 మంది ఓటర్లు) జాజిరెడ్డిగూడెం మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామానికి, మిగిలిన 38 కుటుంబాలు (105 మంది ఓటర్లు)ను నూతనంగా ఏర్పాటు చేసిన నాగారం మండలంలోని పేరబోయినగూడెం గ్రామ పంచాయతీకి కేటాయించారు.

దీంతో ఇక్కడి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో పని నిమిత్తం కొంత మంది 6 కిలోమీటర్లు దూరంలో ఉన్న జాజిరెడ్డిగూడెం మండల కేంద్రమైన అర్వపల్లికి వెళ్లాలి. అలాగే మరికొంత మంది 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగారం బంగ్లాకు వెళ్లాల్సి వస్తుంది.

కాగా ఇక్కడి ప్రజలు రెండు మండలాలకు చెందిన వారు కావడంతో ఆయా మండలాల అధికారులు పనుల నిమిత్తం వస్తున్న ప్రజలు ఏ మండలానికి చెందిన వారో నిర్ధారించుకోలేక కొన్నిసార్లు అయోమయానికి గురవుతూ వారిని రెండు మండల కేంద్రాల చుట్టూ తిప్పుతున్నారు.

 

ఇద్దరు సర్పంచ్‌లతో అభివద్దికి ఆటంకం :

కంచుగట్లగూడెం గ్రామం రెండు గ్రామ పంచాయతీ మధ్య ఉండి ఇద్దరు సర్పంచ్‌లు ఆద్వర్యంలో ఉండటంతో ఇరువురి మద్య పోటితో అభివద్దికి ఆటంకం కలుగుతుంది. గ్రామంలో మురుగు కాల్వల శుభ్రత, వీధిదీపాలు, గ్రామసభల నిర్వహణ విషయాల్లో రెండు పంచాయతీల మధ్య ఇక్కడి ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతూ వెనకబడిపోతున్నారు. దీంతో తమ గ్రామాన్ని మొత్తంగా దగ్గరలో ఉన్న పేరబోయినగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోకి తేవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ఒకే గ్రామ పంచాయతీగా ఉంచాలి : దడిగె మల్లేష్, గ్రామస్తుడు.

మా గ్రామంలో ఉన్న ఓటర్లందరనీ పూర్తిగా పేరబోయినగూడెం గ్రామ పంచాయతీలోనే చేర్చాలి. జాజిరెడ్డిగూడెం పరిధిలో ఉండటం మల్ల మండల కార్యాలయాలకు వెళ్లడం ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పటికైన అధికారులు స్పందించి స్పందించి గ్రామాన్ని మొత్తం ఒకే పంచాయతీగా కేటాయించి అభివద్ధి చేయాలి.

By : Subhash, Thungathurthy

మరిన్ని వార్తలు