Hyderabad : ఈటల రాజేందర్ హెచ్చరిక.. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ భూముల వేలం ఆపకపోతే ఉద్యమం..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22ఏ నిషేధిత భూ జాబితా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయడంతో పాటు దానిలో 30 శాతం కమిషన్ను వీరు తీసుకునేలా ఈ వ్యవహారం ఉందని తీవ్రస్థాయిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు.

Hyderabad : ఈటల రాజేందర్ హెచ్చరిక.. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ భూముల వేలం ఆపకపోతే ఉద్యమం..!
కూకట్ పల్లి, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22ఏ నిషేధిత భూ జాబితా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయడంతో పాటు దానిలో 30 శాతం కమిషన్ను వీరు తీసుకునేలా ఈ వ్యవహారం ఉందని తీవ్రస్థాయిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్మకాల విషయంలో దృష్టి పెట్టడమే తప్ప మౌలిక వస్తువులు కల్పించడంలో విఫలమైందని ఈటెల రాజేందర్ అన్నారు.
వచ్చే నెలలో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ భూముల వేలం విషయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావుతో కలిసి వేలం వేసే స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదవాళ్ల సొంతింటి కల నెరవేర్చేందుకు హౌసింగ్ బోర్డు ను ఏర్పాటు చేస్తే ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు ఉపయోగపడేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్ఐజి,ఎంఐజి, హెచ్ఐజి, ఈడబ్ల్యూఎస్ పేరిట భూములను విక్రయించేందుకు డోర్లు తెరిస్తే రేవంత్ రెడ్డి మొత్తాన్ని గాలికి వదిలేసారని అన్నారు. ఎక్కడ చూసిన చిన్న స్థలంలో నాలుగు నుండి ఆరంతస్తులు నిర్మాణం చేస్తున్నారని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
హౌసింగ్ బోర్డ్ స్థలాలను అమ్మకుండా ఇక్కడ ఉండే నివాసితులకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హాల్, స్కూల్లో నిర్మాణం, ఆట స్థలాలు, పార్కులు, అంగన్వాడి కేంద్రాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. శివారు ప్రాంతాలలో భూములు అమ్మితే 200 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెప్తున్నా నేపథ్యంలో శివారు భూములు అమ్ముకొని ప్రస్తుత ఉన్న భూములను మౌలిక సదుపాయాలకు ఉపయోగించాలన్నారు.
రెండో తేదీన జరగనున్న వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లబ్ధిదారులు ఉంటే అక్కడే నిర్మాణాలు చేపట్టాలని శివారు ప్రాంతాలలో ఇచ్చి వారి పొట్టను పొట్ట వద్దని సూచించారు. ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తాము చెబుతున్నా కూడా ప్రభుత్వం భూముల అమ్మకాల విషయంలో మొండి వైఖరి వీడడం లేదని విమర్శించారు.









