అనారోగ్యంతో బిచ్చగత్తె మృతి.. 30 గోనెసంచుల్లో డబ్బు..!

అనారోగ్యంతో బిచ్చగత్తె మృతి.. 30 గోనెసంచుల్లో డబ్బు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
అనారోగ్యంతో బిచ్చగత్తే మృతిచెందగా 30 గోనెసంచుల్లో డబ్బు వెలుగు చూసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి తెలిస్తే ఖచ్చితంగా కళ్ళు చమర్చక మానరు. అత్యంత పేదరికంలో జీవిస్తూ భిక్షాటనతో రూపాయి రూపాయి కూడ పెట్టి లక్షల రూపాయలు పోగు చేసింది. కానీ ఏం లాభం.. అవి ఏవి ఆమెకు అక్కరకు రాలేదు.
వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మాండ్య కు చెందిన హుర్ (68) అనే వృద్ధురాలు వయోభారంతో పాటు అనారోగ్యం కారణంగా మృతి చెందింది. జీవితాంతం భిక్షాటన చేస్తూ గడిపిన ఆ మహిళ ఇంట్లో లక్షల రూపాయల గోనె సంచులు లభ్యమయ్యాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె మృతి చెందిన తర్వాత స్థానికులు ఆమె అదే ఇంటిని తనిఖీ చేయగా సుమారుగా 30 గోనె సంచుల్లో 10, 20, 50 రూపాయల నోట్లు బయటపడ్డాయి. స్థానికులు వాటిని లెక్కించగా 8,40,000 నగదు లభించింది. అది చూసిన స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
అయితే మృతురాలు తన సోదరితో కలిసి ఆ అద్దె ఇంట్లో నివసించేవారు. ఇద్దరికీ వివాహం కాలేదు. రెండు ఏళ్ల క్రితమే ఆమె సోదరీ కూడా మరణించింది. దాంతో ఆ సొమ్మును హుర్ సోదరులకు అప్పగించారు. ఒక సోదరుడు ఆరు లక్షల రూపాయలు తీసుకోగా మరొక సోదరుడు తన వాటాకి వచ్చిన రెండు లక్షల 40 వేల రూపాయలను స్థానిక మసీదుకు విరాళంగా అందజేశారు.









