Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం..!

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని మిర్యాలగూడ ఇన్చార్జి డీఎస్పీ రవి అన్నారు.

Miryalaguda : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని మిర్యాలగూడ ఇన్చార్జి డీఎస్పీ రవి అన్నారు. సోమవారం పట్టణ జ్యువెలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ: 3,50,000 వేల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలను వన్ టౌన్ సిఐ నాగభూషణరావుతో కలిసి కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ… పట్టణంలోని జ్యువెలరీ దుకాణాలు, పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేయడం, దొంగతనాలు, నేరాలను అరికట్టడం, అలాగే నేరాలకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

ప్రజల భద్రతకు, ముఖ్యంగా వ్యాపార సంస్థల రక్షణకు సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ కీలకంగా పనిచేస్తుందన్నారు. జ్యువెలరీ అసోసియేషన్ వారు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ పట్టణ భద్రతకు సహకరిస్తున్నందుకు పోలీసు అధికారులు అభినందించారు.

MOST READ 

మరిన్ని వార్తలు