అప్రకటిత విద్యుత్ కోతలు.. బీజేపీ ధర్నా, రాస్తారోకో..!
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ 33/11 సబ్ స్టేషన్ ఎదుట రైతులు బిజెపి ఆధ్వర్యంలో కంగ్టి - పిట్లం రహదారిపై బైఠాయించి, వ్యవసాయానికి నిరంతరంగా 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి విజయ్ పాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

అప్రకటిత విద్యుత్ కోతలు.. బీజేపీ ధర్నా, రాస్తారోకో..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ 33/11 సబ్ స్టేషన్ ఎదుట రైతులు బిజెపి ఆధ్వర్యంలో కంగ్టి – పిట్లం రహదారిపై బైఠాయించి, వ్యవసాయానికి నిరంతరంగా 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి విజయ్ పాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సగం ముగుస్తున్న సమయంలో, వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగానికి, కరెంటు కోతలతో పాటు, అరా కోరా కరెంటు సరఫరా వల్ల కొద్దిపాటి సాగు చేసుకున్న పంటలు సైతం కాపాడుకోలేక పోతున్నామని వాపోయారు.
Also Read : చిన్నారి కిడ్నాప్ విషాదాంతం.. హత్య చేసిన సెక్యూరిటీ గార్డ్..!
వచ్చే ఏడు గంటలలో సైతం కరెంటు ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తుందో తెలియక, రైతుల సతమతమవుతుంటే, నాణ్యతలేని కరెంటు విడుదల చేస్తున్నాడంవల్ల మోటర్లు, మొరాయించడంతో పాటు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే విద్యుత్ సమస్యలు వచ్చాయన్నారు.
కరెంట్ కోతలపై రోడ్డెక్కిన రైతులు
తడ్కల్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా రైతు మోర్చా కార్యదర్శి నరేందర్ చారి మాట్లాడుతూ.. అన్నదాతలకు కనీసం ఐదారు గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వక మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : నకిరేకల్ లో కలకలం.. కదులుతున్న ఆటోలో నుంచి దూకిన మైనర్ బాలికలు..!
చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విద్యుత్ సరఫరాలోనే కాకుండా ఎరువులకు నానా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. రైతుబంధు అరకొరగా పంపిణీ చేసి రైతులను నట్టేట ముంచిందన్నారు. రైతులు కన్నీరు పెడుతుంటే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాలప్ప, సుభాన్ రావు పాటిల్, దత్తు సెట్, మారుతి రావు పాటిల్ ,రమేష్ గౌడ్, రాజు, శ్రీనివాస్ రెడ్డి, గొల్ల గంగాధర్, ఆంజనేయులు,దత్తు, సాయిలు , శీను పటేల్, రెడ్డి మహేష్, అంజయ్య చారి, దత్తు రావు, రైతులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.








