చిన్నారి కిడ్నాప్ విషాదాంతం.. హత్య చేసిన సెక్యూరిటీ గార్డ్..!
చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డు అతి దారుణంగా హత మార్చిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. హైదరాబాదులోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి కిడ్నాప్ గురైన విషయం విషాదాంతమైంది.

చిన్నారి కిడ్నాప్ విషాదాంతం.. హత్య చేసిన సెక్యూరిటీ గార్డ్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డు అతి దారుణంగా హత మార్చిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. హైదరాబాదులోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి కిడ్నాప్ గురైన విషయం విషాదాంతమైంది. సరదాగా ఆడుకుంటూ కనిపించకుండా పోయిన చిన్నారి విగతాజీవిగా లభించడంతో తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌకూర్ లోని విల్లా ఆర్చిట్స్ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్న విక్రమ్ అదే అపార్ట్మెంట్ లో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి అరులియా మోజస్ ను సెక్యూరిటీ గార్డు కిడ్నాప్ చేశాడు. కుటుంబ సభ్యుల నుంచి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. డబ్బులు సర్దుబాటు చేస్తామని పాపను క్షేమంగా అప్పగించాలని తల్లిదండ్రులు వేడుకున్నప్పటికీ నిందితుడు ఫోన్ స్విచాఫ్ చేశాడు.
Also Read : ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పై కేసు..!
తన నేరం బయటపడుతుందని పోలీసులకు దొరికిపోతా.. అనే భయంతో నిందితుడు చిన్నారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. చిన్నారిని హత్య చేసి అపార్ట్మెంట్ క్లబ్ హౌస్ సెల్లార్ లోని నీళ్ల సంపులో పడేసి పరారయ్యాడు. గత రెండు రోజులుగా నిందితుడు ఆ చిన్నారి ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా చిన్నారి వెనకాలే నిందితుడు వెళ్తున్న దృశ్యాలను అపార్ట్మెంట్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బాలికను హత్య చేసిన అనంతరం విక్రం సికింద్రాబాద్ వైపు పరారైనట్లు తెలుస్తోంది.
బాధితులను నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా చిన్నారి క్లబ్ హౌస్ సెల్లార్ లోని నీళ్లసంపల విగత జీవిగా కనిపించింది. నిందితుడిని మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించి ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









