BJYM : నారాయణపేటలో బిజెవైఎం నాయకుల అరెస్ట్..!
బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న ఫీజుల బకాయి బిజెపి లాడాయి కార్యచరణలో భాగంగా బీజేవైఎం ఆధ్వ ర్యంలో గురువారం జిల్లా కేంద్రం లోని సత్యనారాయణ కూడలిలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు.

BJYM : నారాయణపేటలో బిజెవైఎం నాయకుల అరెస్ట్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి
బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న ఫీజుల బకాయి బిజెపి లాడాయి కార్యచరణలో భాగంగా బీజేవైఎం ఆధ్వ ర్యంలో గురువారం జిల్లా కేంద్రం లోని సత్యనారాయణ కూడలిలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో నిర్వహిస్తున్న బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేవైఎం పట్టణ అధ్య క్షుడు మణిశంకర్ మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లో నిర్లక్ష్య ధోరణి వ్యవహరి స్తుందని అన్నారు. విద్యా ర్థులకు 2021 నుండి ఇప్ప టివరకు నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి విద్యార్థుల ఆగ్రహం వల్ల గద్దె దిగడం జరిగిందని నేడు కాంగ్రెస్ కూడా అదే ధోరణి వ్యవహరిస్తే విద్యా ర్థులు వారిని కూడా గద్దె దించుతారని హెచ్చరించారు.
ఇప్పటికైనా నిర్లక్ష్య ధోరణి వీడి విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్ , రియంబర్స్మెంట్స్ విడుదల చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేవైఎం ఆధ్వ ర్యంలో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి వారికి రావలసిన బకాయి లను విడుదల చేయించే కార్యచరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్ర మంలో బీజేవైఎం మాజీ పట్టణ అధ్యక్షుడు ప్రకాష్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి చేతన్, మనీ మోడీ, అంజి, అన్వేష్, బాలకృష్ణ, అశోక్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ









