Breaking Newsక్రైంతెలంగాణప్రపంచం
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకులు ముగ్గురు మృతి..!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకులు ముగ్గురు మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతుల్లో నిజామాబాద్ జిల్లా నవీపేట్ కు చెందిన రాహుల్ ఉన్నారు.
రాహుల్ మూడు నెలల క్రితమే అమెరికాకు వెళ్ళాడు. ఉన్నత చదువుల కోసం ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు. ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాహుల్ మృతితో నవీపేట్ లో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.









