Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Big Breaking : కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..!
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందగా మరో 20 మందికి గాయాలయ్యాయి.

Big Breaking : కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..!
మన సాక్షి, సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందగా మరో 20 మందికి గాయాలయ్యాయి. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ద్వారకుంట స్టేజి వద్ద ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు బస్సు వెనుక నుంచి కాంటైనర్ డిసీఎంను ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Most Read :









