Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి పనులు ప్రణాళిక బద్దంగా చేయాలి..!

మున్సిపల్ ఛైర్మన్ సుధా బాలకృష్ణ అధ్యక్షతన మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Miryalaguda : మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి పనులు ప్రణాళిక బద్దంగా చేయాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మున్సిపల్ ఛైర్మన్ సుధా బాలకృష్ణ అధ్యక్షతన మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పట్టణంలో మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, రహదారులు, డ్రైనేజీ తదితర ప్రజా అవసరాలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా చర్చించి, అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు..

మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు మరియు సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులను చేపట్టి, వాటి అమలులో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు..

పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంపై ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ, మిర్యాలగూడను మరింత అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీజా రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు