Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

సామాన్యుడి నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం.. నిసార్ అహమద్

అన్నమయ్య జిల్లా నిత్యావసర ధరలు, పెట్రోల్-డీజిల్ భారంతో సామాన్యుడి జీవితం భారంగా మారిందని మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహమద్ విమర్శించారు.

సామాన్యుడి నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం.. నిసార్ అహమద్

మదనపల్లి, ఆగస్టు 25 మనసాక్షి

అన్నమయ్య జిల్లా నిత్యావసర ధరలు, పెట్రోల్-డీజిల్ భారంతో సామాన్యుడి జీవితం భారంగా మారిందని మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహమద్ విమర్శించారు. సోమవారం మదనపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాతూ 2024 జూన్ తో పోల్చితే 2026 ఆగస్టులో నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని, ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టరేట్ అఫ్ ఎకనామిక్స్ స్టాటిష్టిక్స్ (డేస్ ) గణాంకాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

డేస్ గణాంకాల ప్రకారం ధరల పెరుగుదల పామాయిల్: రూ 92.67 నుంచి రూ 153.18కి (65.30శాతం పెరుగుదల సన్‌ఫ్లవర్ ఆయిల్: రూ 113.23 నుంచి రూ 179.28కి (58.33శాతం పెరుగుదల వేరుశెనగ నూనె: రూ 165.20 నుంచి రూ 184.50కి11.68శాతం పెరుగుదల)- పంచదార: రూ 43.49 నుంచి రూ 70.87కి (75శాతం పెరుగుదలఉల్లి: రూ 38.27 నుంచి రూ 60కి (80శాతం పెరుగుదల) పెట్రోల్-డీజిల్ ధరలు కూడా పెరిగాయని, విజయవాడలో 2024 జూన్ 6న పెట్రోల్ రూ 109.79 ఉంటే, 2026 ఆగస్టు 25న రూ 118.05కి చేరిందని, డీజిల్ రూ 97.61 నుంచి రూ 105.71కి పెరిగిందని, ఇది పొరుగు రాష్ట్రాల కంటే అధికమని ఆయన అన్నారు.

దీపం-2.0పై శ్వేతపత్రం విడుదల చేయాలి:

వి.ఎస్.రెడ్డి మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ, దీపం-2.0 పథకం కింద ఏడాదికి 3 కోట్ల 24 లక్షల సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా, రెండేళ్లకు రూ.5676 కోట్లు ఇవ్వాల్సి ఉందని, కానీ అందులో 25శాతం కూడా ఇవ్వలేదని, సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని విమర్శించారు. పార్టీ పరిశీలకురాలు ఎన్. అనూషా రెడ్డి మాట్లాడుతూ, ఒక చేత్తో మూడు సిలిండర్లు ఇచ్చామని చెబుతూ, మరో చేత్తో నిత్యావసర ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ డిమాండ్లు నిత్యావసర ధరల నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతపై కఠిన చర్యలు తీసుకోవాలి రైతుబజార్లను సమర్థంగా నిర్వహించాలి. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర పన్నులను పునఃసమీక్షించాలి, దీపం-2.0పై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈ కార్యక్రమంలో ఎన్. ఇర్ఫాన్ ఖాన్, శ్రీనివాసులు, ప్రసాద్ బాబు, కొమ్మేపల్లి శ్రీనివాసులు రెడ్డి, ఎల్. రఘునాథ రెడ్డి, శీలం రమేశ్, బయ్యా రెడ్డి, కొత్తపల్లి నాగార్జున నాయుడు, ఎన్. నవాజ్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు