Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంసంగారెడ్డి జిల్లా

ప్రేమ వివాహం ఒప్పుకోలేదని తల్లిదండ్రులను హత్య చేసిన కూతురు ఆత్మహత్య..!

ప్రేమ వివాహం ఒప్పుకోలేదని తల్లిదండ్రులను మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసిన కూతురు ఆత్మహత్యకు పాల్పడింది.

ప్రేమ వివాహం ఒప్పుకోలేదని తల్లిదండ్రులను హత్య చేసిన కూతురు ఆత్మహత్య..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రేమ వివాహం ఒప్పుకోలేదని తల్లిదండ్రులను మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసిన కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులను చంపినట్లే తాను కూడా మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడిని నక్కల సురేఖ అనే యువతి ప్రేమించింది. కాగా ఆమె ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

జనవరి నెలలో తల్లిదండ్రులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసింది. కాగా అప్పటి పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపగా జనవరి నెల నుంచి జూలై 31 వ తేదీ వరకు జైల్లోనే ఉంది. జనవరి 31వ తేదీన బైయిల్ పై బయటకి వచ్చింది. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా శాంతినగర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగాన్వేషణలో ఉంది. ఆ తర్వాత ఈనెల 23వ తేదీన అర్ధరాత్రి సమయంలో మత్తు ఇంజక్షన్ తీసుకొని సురేఖ ఆత్మహత్యకు పాల్పడింది. తనకు బ్రతకాలని లేదని సూసైడ్ నోట్లో రాసి ఉంచింది.

MOST READ 

మరిన్ని వార్తలు