అధికారుల నిర్లక్ష్యం.. అయోమయంలో ఓటర్లు..!
అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్లు అయోమయంలో పడ్డారని మూడవ వార్డు కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ ఆరోపించారు. గురువారం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సార్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆయా వార్డుల్లో అన్ని ప్రజలను కలిసి ఓటరు జాబితాను తయారు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ వారికి తోచిన విధంగా తయారు చేశారని ఆరోపించారు.

అధికారుల నిర్లక్ష్యం.. అయోమయంలో ఓటర్లు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్లు అయోమయంలో పడ్డారని మూడవ వార్డు కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ ఆరోపించారు. గురువారం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సార్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆయా వార్డుల్లో అన్ని ప్రజలను కలిసి ఓటరు జాబితాను తయారు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ వారికి తోచిన విధంగా తయారు చేశారని ఆరోపించారు.
మూడవ వార్డులోని ప్రజలను ఓటర్లుగా నమోదు చేయడం తో పాటు కొంతమందిని వార్డులో ఉన్నవారికి వేరే వార్డులో నమోదు చేసి ఆ వాటిలో ఉన్న వారిని మూడో వార్డులో నమోదు కావడం ఈ అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం అని అన్నారు. అంతేకాకుండా 137 బూతులో ఉన్న ఓటర్ల కలర్ ఫోటోలను కూడా జాబితాలో వేయకపోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.
137 బూతులో ఉన్న ఓటర్లను 127 అలాగే135 బూతు జాబితాలో అధికారులు నమోదు చేశారని ఆమె అన్నారు. 127, 135బూతులోని ఓటర్లను137 బూతులో నమోదు చేయాలని ఆమె అధికారులకు కోరారు. ఓటర్లను కూడా అదే బూతులు కలర్ ఫోటోలతో సహా ఓటర్ జాబితాలో నమోదు చేయాలని ఆమె అధికారులకు కోరారు.ప్రభుత్వ అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓటర్ల నమోదు జాబితాను తప్పుల తడకగా తయారు చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.
38 మందిని 137 బూతులో నమోదు చేయాలని అధికారులకు వినతి పత్రం ఇచ్చినా కూడా అధికారులు 137 లో నమోదు చేయకపోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. అధికారులు మాత్రం 135 లో ఉన్న ఓటర్లను వేరే బూతులలో నమోదు చేయడం సరైనది కాదని ఆమె అన్నారు.
ఓటర్ల కలర్ ఫోటోలు కూడా నమోదు చేయకపోవడంతో పాటు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు. అధికారులకు వార్డులోని ప్రజలు సహకరించినా కూడా ఓటర్ జాబితా తయారు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తూ జాబితాను తయారు చేయడం ఇది ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.