Bonus : వానాకాలం వరి ధాన్యం బోనస్ కు దరఖాస్తులు.. మరి కొద్ది రోజులు గడుపు..!
వానాకాలం సీజన్‌లో సన్న వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అందించే క్వింటాలుకు రూ.500 అదనపు ప్రోత్సాహక (బోనస్) దరఖాస్తు గడువును వచ్చే నెల సెప్టెంబరు 10వ తేదీ వరకు పొడిగించినట్లు గుర్రంపోడు మండల వ్యవసాయ అధికారి మాధవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Bonus : వానాకాలం వరి ధాన్యం బోనస్ కు దరఖాస్తులు.. మరి కొద్ది రోజులు గడుపు..!
గుర్రంపోడు, మన సాక్షి :
వానాకాలం సీజన్‌లో సన్న వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అందించే క్వింటాలుకు రూ.500 అదనపు ప్రోత్సాహక (బోనస్) దరఖాస్తు గడువును వచ్చే నెల సెప్టెంబరు 10వ తేదీ వరకు పొడిగించినట్లు గుర్రంపోడు మండల వ్యవసాయ అధికారి మాధవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన 7 రకాల సన్న వరి వంగడాలను (బీపీటీ-5204, కేఎన్ఎమ్-1638, ఆర్ఎన్ఆర్-15048, హెచ్ఎంటీ సోనా, కేఎన్ఎమ్-7715, జైశ్రీరామ్, డబ్ల్యూజీఎల్-44) సాగు చేసిన రైతులకు మాత్రమే ఈ బోనస్ లబ్ధి చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.సన్న రకాలు పండించిన రైతులు తాము ధాన్యం విక్రయించే సమయంలో కొనుగోలు కేంద్రాలు లేదా మిల్లుల వద్ద తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకుని, గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
సొంతంగా సన్న వరి సాగు చేసిన రైతులు వెంటనే తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసి తమ పేరు, పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని కోరారు.మండలంలో ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ పంట సర్వే (ఆన్‌లైన్ పంట వివరాల నమోదు) కార్యక్రమానికి రైతులందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని వ్యవసాయ అధికారి మాధవరెడ్డి విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వచ్చే సర్వే సిబ్బందికి తమ సాగు వివరాలను అందించి, భూమి వారీగా పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలన్నారు.
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల వానాకాలం సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని, ఈ నేపథ్యంలో నీటి లభ్యత తక్కువగా ఉన్న రైతులు వరి సాగుకు ప్రత్యామ్నాయంగా, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేసుకోవడం ఉత్తమమని ఆయన రైతులకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
- Miryalaguda : మిర్యాలగూడలో రైస్ మిల్లుల మాటున రేషన్ దందా.. రీసైక్లింగ్ జరుగుతున్నాయి జర జాగ్రత్త..!
- Narayanpet : నారాయణపేట జిల్లాలో దారుణం.. కన్న కొడుకు ముందే తల్లిపై లైంగిక దాడి..!
- రీల్స్ మోజులో యువతి.. రైలు పట్టాలపై రీల్స్.. చివరికి ఏమైందంటే..!
- BIG BREAKING : చిలుకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మృతి..!









