Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsviralక్రైంజాతీయం

రీల్స్ మోజులో యువతి.. రైలు పట్టాలపై రీల్స్.. చివరికి ఏమైందంటే..!

ఇటీవల కాలంలో రీల్స్ మోజులో పడి యువత ప్రాణాలు కోల్పోతున్నారు. నడుస్తున్న వాహనాలు, రైళ్లతో పాటు ప్రవహిస్తున్న నదులలో కూడా రీల్స్ చేస్తున్నారు.

రీల్స్ మోజులో యువతి.. రైలు పట్టాలపై రీల్స్.. చివరికి ఏమైందంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఇటీవల కాలంలో రీల్స్ మోజులో పడి యువత ప్రాణాలు కోల్పోతున్నారు. నడుస్తున్న వాహనాలు, రైళ్లతో పాటు ప్రవహిస్తున్న నదులలో కూడా రీల్స్ చేస్తున్నారు. సాహసమైన ఘట్టాలలో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అయితే రీల్స్ మోజులో పడిన ఓ యువతి ఏం చేసిందదో తెలుసుకుందాం..

జార్ఖండ్ లోని గాడ్వార్ జిల్లాలో పూర్ణిమ (19) రీల్స్ మోజులో పడి రైలు పట్టాలపై రీల్స్ చేస్తుంది. నాగర్ – ఉంటారి రైల్వే సెక్షన్ సమీపంలో ఆ యువతి రైలు పట్టాలపై రీల్స్ చేస్తుంది.

ఆ సమయంలో రాంచీ – చోపాన్ ఎక్స్ ప్రెస్ దూసుకొచ్చింది. బలంగా ఆమెని ఢీ కొట్టింది. ఈ ఘటనలో పూర్ణిమ రెండు చేతులు కోల్పోవడంతో పాటు ఇతర భాగాల్లో కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితులు వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

MOST READ 

మరిన్ని వార్తలు