Nagarjunasagar : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల..!
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్ లో నీటి నిల్వలు తగ్గిపోవడం వల్ల ఆ జలాశయాన్ని నింపడం కోసం నీటిని విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Nagarjunasagar : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల..!
నాగార్జునసాగర్, మన సాక్షి :
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్ లో నీటి నిల్వలు తగ్గిపోవడం వల్ల ఆ జలాశయాన్ని నింపడం కోసం నీటిని విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ నీటి విడుదల నాలుగు రోజులపాటు కొనసాగనట్లు సమాచారం. మొదటగా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు క్రమంగా పెంచనున్నారు. పెద్దదేవులపల్లి రిజర్వాయర్ నిండిన తర్వాత కాల్వ ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ కు నీటిని విడుదల చేస్తారా..? లేదా..? అనేది స్పష్టత రాలేదు.
నాగార్జునసాగర్ జలాశయంలో 590 అడుగుల గరిష్ట నీటిమట్టం గాను ప్రస్తుతం 534 అడుగుల నీరు నిల్వ ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 180 టిఎంసిల నీరు ఉన్నది. సాగర్ జలాశయానికి 21 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుంది. ప్రస్తుతం సాగర్ జలాశయం నుంచి సాగర్ ఎడమ కాలువతో పాటు కుడి కాలువకు కూడా నీటిని విడుదల చేశారు.