Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. రేపటి నుంచి గ్రామసభలు..!

ఈ నెల 27వ తేదీ గురువారం నాడు జగిత్యాల జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామసభలు, పట్టణ ప్రాంతాల్లో వార్డుసభలు నిర్వహించబడతాయి.

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. రేపటి నుంచి గ్రామసభలు..!

మనసాక్షి, జగిత్యాల జిల్లా ప్రతినిధి :

ఈ నెల 27వ తేదీ గురువారం నాడు జగిత్యాల జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామసభలు, పట్టణ ప్రాంతాల్లో వార్డుసభలు నిర్వహించబడతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీ భవనాల్లో, పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈ సభలు జరుగుతాయి.

ఈ సభల్లో బూత్ లెవల్ అధికారులు, అంటే బీఎల్‌ఓలు, ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారు.కాబట్టి ప్రతి ఓటరూ ఈ సభకు హాజరై, ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోండి.

మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోండి… మీ ఓటు హక్కును కాపాడుకోండి…ప్రజాస్వామ్యంలో మీ భాగస్వామ్యాన్ని చాటుకోండి! జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

MOST READ

మరిన్ని వార్తలు