Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయంహైదరాబాద్

అలా చేయకుంటే మళ్లీ గెలవడం కష్టం.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పనితీరు, పార్టీ అంతర్గత పరిస్థితులపై ఆయన స్పందించారు.

అలా చేయకుంటే మళ్లీ గెలవడం కష్టం.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పనితీరు, పార్టీ అంతర్గత పరిస్థితులపై ఆయన స్పందించారు. ఇంకా చేయాల్సిన పని చాలా మిగిలి ఉందని, ప్రభుత్వంతో పాటు క్యాబినెట్ పనితీరులోను స్పష్టమైన మార్పు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లోపించిందని గ్రూపు తగాదాలు, వర్గ పోరు తగ్గించుకోకపోతే తీవ్రంగా నష్టం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. పార్టీ గీత దాటితే కఠినంగా వేటువేయాలని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. హామీ ఇచ్చిన పెన్షన్లను తక్షణమే పెంచి అమలు చేయాలని, రైతు భరోసా పథకాన్ని కొనసాగించాలని, వివాదాస్పదమైన 22 ఏ నిబంధనలను రద్దు చేయాలని ఆయన పేర్కొన్నారు.

అనవసరమైన ఉచితాలను తగ్గించాలని, తెలంగాణ ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన క్యాడర్ లో ఉన్న అసంతృప్తిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మార్పులన్నీ సరిగ్గా పూర్తి చేస్తేనే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, లేకపోతే రాబోయే రోజుల్లో చాలా కష్టమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని సుఖేందర్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి కే అడ్డంకులు సృష్టించే పరిస్థితులు తీసుకురావడం సరైనది కాదని, పరిపాలన సజావుగా సాగేందుకు ఆయనకు పూర్తిస్థాయిలో అందరూ సహకరించాలని కోరారు.

MOST READ 

మరిన్ని వార్తలు