Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

భూ భారతి చట్టం ద్వార వివాద రహిత భూములన్నింటికీ పట్టాదారు పాసు పుస్తకాలు..!

రానున్న సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వివాదరహిత భూములన్నిటీని ప్రతి అంగుళాన్ని సర్వే చేసి భూ ఆసాములకు పట్టాలు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

భూ భారతి చట్టం ద్వార వివాద రహిత భూములన్నింటికీ పట్టాదారు పాసు పుస్తకాలు..!

నూతనకల్ లో 1061 మంది రైతులకు
1044 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

సూర్యాపేట (నూతనకల్) ఆగస్టు 29 మనసాక్షి

రానున్న సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వివాదరహిత భూములన్నిటీని ప్రతి అంగుళాన్ని సర్వే చేసి భూ ఆసాములకు పట్టాలు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం అయన సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండల కేంద్రంలో నూతనకల్, మద్దిరాల మండలాలకు సంబంధించి దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న 15 గ్రామాల లోని 1061 మంది రైతులకు 1044 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ సాగు చేసుకుంటున్న భూములకు ఏళ్ళ తరబడిగా పట్టాలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, దాని ద్వారా వివాద రహిత భూములన్నింటికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో తాతలనాటి నుండి వస్తున్న భూ సమస్యలకు భూ భారతి ద్వారా పరిష్కారం చేస్తున్నామన్నారు. భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రతి అంగుళం భూమిని అధికారులు సర్వే చేసి నిజమైన ఆసాములకు హక్కు పత్రాలు అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని తెలిపారు.

ALSO READఅలా చేయకుంటే మళ్లీ గెలవడం కష్టం.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడతన 70 గ్రామాలను ఎంపిక చేసుకొని సర్వే చేయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల రెవెన్యూ, దేవాదాయ, అసైన్డ్ భూములు కబ్జాకు గురవుతుండడం తమ దృష్టికి వచ్చిందని,వీటిని అరికట్టేందుకు తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా రానున్న సంవత్సరకాలంలో ప్రతి అంగుళాన్ని సర్వే చేస్తామని, వివాదారహిత భూములన్నింటికీ పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని పునరుద్గాటించారు.

పంచాయతీలేని భూములకు, భూములున్న ఆసాములు అందరికీ పట్టాలిస్తామన్నారు.
గత ప్రభుత్వం 8 లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల అప్పును తమ ప్రభుత్వం పై మోపినప్పటికీ తల తాకట్టు పెట్టైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అపకూడదన్నదే తమ ఉద్దేశమని, సంక్షేమ కార్యక్రమాలు కుంటు పడకుండా తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, అందులో భాగంగానే రైతులకు కూడా న్యాయం చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వలేదని, ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నదని అన్నారు.

ALSO READBonus : వానాకాలం వరి ధాన్యం బోనస్ కు దరఖాస్తులు.. మరి కొద్ది రోజులు గడుపు..!

గడచిన రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో మహిళలకు 63 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని, రానున్న రెండున్నర ఏళ్లలో కూడా అంతే రుణాలు ఇస్తామని ,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు, సన్నబియ్యం, రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఘనత తమదేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి జనం బ్రహ్మ రథం పడుతున్నారని,హైద్రాబాద్ లో కోట్ల రూపాయల విలువచేసే భూములలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించి ఇస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత,3500,రెండో విడత 2000 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, మూడవ ,నాలుగో విడతల్లో కూడా ఇస్తామని, ప్రతి నియోజకవర్గంలో అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి వెల్లడించారు .

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల రైతుల సమస్యలకు పరిష్కారం పట్టాలు ఇవ్వడమని అన్నారు. భూమికి హక్కు ఉంటే రైతుకు ధైర్యం ఉంటుందని, రైతులకు రైతు భరోసా, రైతుబంధు, భీమా, ఇతర లబ్ధి చేకూరుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 5 లక్షల రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవని, రాష్ట్రవ్యాప్తంగా 36వేల కోట్ల రూపాయలతో హ్యం రోడ్లను నిర్మిస్తున్నామని, తుంగతుర్తి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలతో రోడ్లు మంజూరు చేయడం జరిగిందని, మరో 200 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు.

అలాగే సూర్యాపేట నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లను వేస్తామని తెలిపారు. ప్రజలకు సన్నబియ్యం, రైతు భరోసా, రైతుబంధు ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్లను ఎట్టి పరిస్థితులలో ఆపమని, గుడిసె ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి గుడిశెలేని తెలంగాణగా మారుస్తామని అన్నారు.

భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రజాపాలన అని,గత కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కానీ రైతుల సమస్యలు పట్టాల పంపిణీతో ఇప్పుడు పరిష్కారం అయ్యాయని, తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత బస్సు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, ప్రజలు వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు .

ALSO READ : District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆయా గ్రామాల్లో రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి..!

తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడుతూ పొలాలను సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు లేనందువల్ల ఎన్నో బాధలకు గురయ్యారని, అలాంటి 60 సంవత్సరాల సమస్య తీర్చినందుకు రెవెన్యూ మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. పట్టాల పంపిణీతో రైతులు వారి భూములకు హక్కుదారులు అయ్యారని, గతంలో కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వం 25 లక్షల ఎకరాల భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత తమకే దక్కిందని, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా హక్కు పత్రాలు ఇవ్వడం జరిగిందని, భూమి అనేది రైతుకు ఆత్మ గౌరవం అని ,భూమి హక్కు లేకుంటే గుర్తింపు ఉండదని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రోడ్లను మంజూరు చేయాలని, తుంగతుర్తి నియోజకవర్గానికి అదనంగా ఇండ్లు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ దేశంలో సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత కూడా అంతకుముందు ఉన్న వివిధ కారణాలవల్ల పట్టాలు రాని వారు రైతుబంధు, రైతు బీమా, రైతు భరోసా, రుణాలు, విత్తనాలు వంటివి రాక అనేక ఇబ్బందులు పడ్డారని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వీటి పరిష్కారానికై రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, ఇందులో భాగంగా నూతనకల్ మద్ధిరాల మండలాలలోని 15 గ్రామాలలో 3000 ఎకరాలకు పైగా భూములన్ని సర్వే చేసి పరిశీలించి రైతుల పొలాల వద్దకు వెళ్లి వారికి నోటీసులు ఇచ్చిన పిదప ముసాయిదా ఆర్గుల జాబితాను ప్రకటించడం జరిగిందని , సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వడం జరుగుతున్నదని ,ఈ రెండు మండలాలలో 1060 మంది రైతులకు 1044 ఎకరాలకు పట్టాల పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

ALSO READ Cyber : ఇప్పుడు సరికొత్త హైబ్రిడ్ సైబర్ మోసం.. ఎలా చేస్తారంటే.. అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచన..!

వీటితోపాటు భూభారతి కింద రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఇస్తున్నామని, ఖాతాలు లేని వారికి కూడా కొత్తగా ఖాతాలు ఇస్తున్నట్టు వెల్లడించారు.
రాష్ట్ర రెవెన్యూ,సిసి ఎల్ ఏ సెక్రటరీ లోకేష్ కుమార్, ల్యాండ్ సర్వీస్ సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ హరి సింగ్ ,ఆర్డీవోలు, తహసిల్దారులు, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు