Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం.. వేప చెట్టుతో మొదలైన వివాదం.. ఇద్దరి మృతి..!

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో తీవ్ర విషాదం నెలకొన్నది. వేపచెట్టు విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఇద్దరి మృతితో విషాదం చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం.. వేప చెట్టుతో మొదలైన వివాదం.. ఇద్దరి మృతి..!

మన సాక్షి, మేళ్లచెరువు :

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో తీవ్ర విషాదం నెలకొన్నది. వేపచెట్టు విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఇద్దరి మృతితో విషాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గొడ్డలితో దాడి చేయగా మంద వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి మృతి చెందారు.

ALSO READ : ఏపీలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..!

మరో వ్యక్తి సైదా కూడా తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో ఎర్రగడ్డ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..

మరిన్ని వార్తలు