Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ వెలుగులు..!

చిన్నారుల భవిష్యత్తుకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా అంగన్వాడి కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నట్లు జగిత్యాల సర్కిల్ ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం తెలిపారు.

అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ వెలుగులు..!

మనసాక్షి, జగిత్యాల ప్రతినిధి :

చిన్నారుల భవిష్యత్తుకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా అంగన్వాడి కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నట్లు జగిత్యాల సర్కిల్ ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం తెలిపారు. సర్కిల్ పరిధిలోని 390 అంగన్వాడి కేంద్రాలకు ఇప్పటికే ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు వెల్లడించారు.

ALSO READ : అలా చేయకుంటే మళ్లీ గెలవడం కష్టం.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

దీంతో కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలను వినియోగించుకునే అవకాశం ఏర్పడిందన్నారు.విద్యుత్ సౌకర్యంతో చిన్నారులకు సౌకర్యవంతమైన విద్యా వాతావరణం ఏర్పడటంతో పాటు, ప్రీ-స్కూల్ కార్యకలాపాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య, పరిశుభ్రత కార్యక్రమాల నిర్వహణ మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ప్రతి అంగన్వాడి కేంద్రం విద్యుత్ వెలుగులతో కళకళలాడేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఈ తెలిపారు.

మరిన్ని వార్తలు