Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

డిజిటల్‌ క్రాప్‌ సర్వేతో పక్కాగా లెక్క.. రైతు భరోసాకు ఇదే ఫైనల్..?

తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నాగారం మండల పరిధిలో వ్యవసాయాధికారులు ప్రతి ఏటా పంటల సాగు విస్తీర్ణం వివరాలు సేకరించి.. ప్రభుత్వానికి పంపిస్తారు. అయితే ఈ లెక్కల్లో పూర్తి స్థాయి కచ్చితత్వం ఉండవు. కొంత సమాచారం సేకరించి అంచనాలు వేసి ఆ గ్రామంలో ఈ పంట ఎన్ని ఎకరాలు.. మరో గ్రామంలో ఎన్ని ఎకరాలు అని నోటి లెక్కలు వేసి.. మండల, జిల్లావ్యాప్తంగా విస్తీర్ణం నిర్ణయిస్తారు.

డిజిటల్‌ క్రాప్‌ సర్వేతో పక్కాగా లెక్క.. రైతు భరోసాకు ఇదే ఫైనల్..?

సాగు విస్తీర్ణంపై కచ్చితమైన లెక్కల కోసం ప్రత్యేక డిజిటల్‌ యాప్‌ రూపకల్పన

– పంటల దిగుబడి కొనుగోలుపై తేలనున్న లెక్క

(తుంగతుర్తి – ఓరుగంటి శుభాష్ )

తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నాగారం మండల పరిధిలో వ్యవసాయాధికారులు ప్రతి ఏటా పంటల సాగు విస్తీర్ణం వివరాలు సేకరించి.. ప్రభుత్వానికి పంపిస్తారు. అయితే ఈ లెక్కల్లో పూర్తి స్థాయి కచ్చితత్వం ఉండవు. కొంత సమాచారం సేకరించి అంచనాలు వేసి ఆ గ్రామంలో ఈ పంట ఎన్ని ఎకరాలు.. మరో గ్రామంలో ఎన్ని ఎకరాలు అని నోటి లెక్కలు వేసి.. మండల, జిల్లావ్యాప్తంగా విస్తీర్ణం నిర్ణయిస్తారు.

ఈ లెక్కల ఆధారంగా ఎరువుల కేటాయింపు, పంటల దిగుబడి కొనుగోళ్లు చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయానికి వస్తుండటంతో.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తారుమారవుతాయి. అయితే ఇకపై కాకి లెక్కలకు పుల్‌స్టాప్‌ పెట్టాలని భావించిన కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ ద్వారా పూర్తిస్థాయిలో పంటల సాగు విస్తీర్ణం కచ్చితత్వంగా ఉంటుంది. వలంటీర్‌ సహాయంతో డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయనుంది. ఇక పంటల సాగు వివరాలు, ఎకరాలు, సర్వే నంబర్‌తో సహా, రైతుల పేర్లు వెలుగులోకి రావడంతో ఆ లెక్కలతోనే సాగు చేసిన ఎకరాలకే రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా ఇవ్వనుందని సమాచారం.

ALSO READ : Miryalaguda : మిర్యాలగూడలో రైస్ మిల్లుల మాటున రేషన్ దందా.. రీసైక్లింగ్ జరుగుతున్నాయి జర జాగ్రత్త..!

డిజిటల్‌ క్రాప్‌ సర్వే:

కేంద్ర ప్రభుత్వం చిన్న గ్రామం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏ పంట ఎంత విస్తీర్ణంలో, ఏ రైతు ఎంత సాగు చేశారో కచ్చితమైన లెక్కలు ఉండాలనే ఉద్దేశ్యంతో డిజిటల్‌ క్రాప్‌ సర్వే కొత్త యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ ద్వారా ప్రతి పంట విస్తీర్ణంతో పాటు ఏ స్థలం ఎక్కడ, ఏ రైతు పొలంలో వేశారో తేలనుంది. గ్రామం నుంచి మండలంలో జిల్లాలో, రాష్ట్రంలో ఎన్ని ఎకరాల్లో ఏ పంట సాగు వేశారో ఎంత మంది రైతులో సంఖ్య తేలుతుంది. అన్ని రకాల పంటల వివరాలు ఎకరాల్లో కచ్చితమైన సమాచారం ఉంటుంది. దీంతో రైతుల వద్ద ఉన్న పంట ఎంత దిగుబడి వస్తుందో అంచనాకు రావచ్చు. మార్కెట్‌ కొనుగోలు, విక్రయాలకు కూడా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ వివరాలు అన్నింటిని రైతులు పేర్లతో సహా ధాన్యం కొనుగోలు చేసే ఏజెన్సీలకు అప్పగిస్తారు.

ALSO READరాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత చేపట్టిన రీ సర్వేకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి..!

ఎరువుల కేటాయింపులు:

పంటల సాగు విస్తీర్ణంతో కేంద్ర ప్రభుత్వం ఎరువులు కేటాయింపు అంచనాకు వస్తుంది. ఈ రాష్ట్రానికి ఇన్ని ఎరువులు అవసరమని నిర్ణయించి పంపిస్తుంటారు. ఒక్కో పంటకు ఈ రకమైన ఎరువులు అవసరమని మోతాదులో లెక్కిస్తుంటారు. అయితే గతంలో కచ్చితమైన లెక్కలు లేకపోవడంతో ఎరువుల కొరత నెలకొంటుంది. ఇకపై అలా కాకుండా ఈ యాప్‌ ద్వారా సాగు లెక్కలు స్పష్టంగా తేలుతుండటంతో చాలా వరకు సమస్య తీరుతుంది. ఇతర దేశాల నుంచి అధికంగా దిగుమతి చేసుకునే వాటిని ఇక్కడ పండించే విధంగా రైతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది..

ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత:

పంటల సాగు వివరాలు తెలిస్తే పత్తి, మొక్కజొన్న, వరి ధాన్యం ఇతరత్రా పంటల కొనుగోళ్లపై ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. రైతు సాగు చేసిన పంట వివరాలు రావడంతో ఆ పంట దిగుబడి విక్రయానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పత్తి పంట విషయా నికి వస్తే సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తుంటారు. విక్రయాల సమయంలో రైతులు అమ్ముకోవడా నికి వ్యవసాయాధికారులు తక్కువగా నమోదు చేశారని ఆందోళన దిగుతారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. కచ్చితంగా ఎంత సాగు చేశారో తేలిపోతుంది. ప్రభుత్వం కొనుగోలు చేసే పంటల విషయంలోనూ స్పష్టత ఉంటుంది.

ALSO READ : Miryalaguda : నాగార్జునసాగర్ ఎడమ కాలువ మేజర్ లకు నీటి విడుదల..!

రైతుభరోసా..ఈ లెక్కలతోనే:

ప్రతి వానాకాలం, యాసంగి సీజన్‌లో పంట లెక్కలు తీస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎకరానికి సీజన్‌కు రూ.6 వేలు ఇస్తోంది. పంటలు సాగు చేసిన వారికే ఇవ్వాలని నిర్ణయించి. అలాగే కొన్ని దఫాలుగా ఇస్తున్నారు. అయితే కచ్చితమైన లెక్కలు లేకపోవడం ఏఈఓలు ఫోన్‌ల ద్వారా సమాచారం సేకరించి జాబితా తయారు చేసి పంపించేవారు. ఇప్పుడు ఈ యాప్‌ ద్వారా ఫలానా రైతు ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశారో లెక్క తెలుస్తోంది. దీంతో రైతు భరోసా పంట సాగు చేసిన ఎకరాలకు, రైతుకు ఇవ్వడానికి సులువుగా ఉంటుంది. బీడు భూమలుకు ఇకరాదు. దీంతో సాగు చేసిన నిజమైన రైతుకు భరోసా లభించడంతో పాటు ప్రభుత్వంపై భారం తగ్గుతుంది.

వారం రోజుల్లో ప్రారంభిస్తాము:

– జి.శ్రీధర్‌ రెడ్డి,జిల్లా వ్యవసాయశాఖ అధికారి

డిజిటల్‌ క్రాప్‌ సర్వే వారం రోజుల్లో ప్రారంభమవుతుంది. సర్వేకు ప్రత్యేకంగా వాలంటీర్‌లను నియమించారు. ఇప్పటికే వారికి శిక్షణ ఇచ్చారు. ఈ డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో కచ్చితమైన లెక్కలు వస్తాయి. ఈ యాప్‌ ద్వారా ప్రతి పంట విస్తీర్ణంతోపాటు ఏ స్థలం ఎక్కడ, ఏ రైతు పొలంలో వేశారో తేలనుంది.

జిల్లాలో ఇలా.:

వరి–3.60 లక్షల ఎకరాలు
పత్తి–90వేల ఎకరాలు
కంది,పెసర–25వేల ఎకరాలు
మిర్చి–18వేల ఎకరాలు
మొక్కజొన్న–10వేల ఎకరాలు

మరిన్ని వార్తలు