నల్గొండ జిల్లాలో దారుణం.. మానసిక వికలాంగురాలుపై అత్యాచారం..!
నల్గొండ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బత్తల పాలెం గ్రామంలో ఆదివారం రోజు గుర్తుతెలియని వ్యక్తులు దివ్యాంగురాలు పై అత్యాచారం చేసి పారిపోయిన సంఘటన చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లాలో దారుణం.. మానసిక వికలాంగురాలుపై అత్యాచారం..!
దామరచర్ల, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బత్తల పాలెం గ్రామంలో ఆదివారం రోజు గుర్తుతెలియని వ్యక్తులు దివ్యాంగురాలు పై అత్యాచారం చేసి పారిపోయిన సంఘటన చోటుచేసుకుంది. ఆమె తల్లి ఒంటరిగా తనను ఇంట్లో వదిలి ఆసుపత్రికి వెళ్లి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమెను పక్కనే ఉన్న పాడుబడిన గదిలోకి లాక్కెళ్ళి చేతులు కాళ్ళను బైండింగ్ తీగలతో కట్టేసి హత్య అత్యాచారం చేసి పారిపోయినట్లు తెలుస్తుంది.
ALSO READ : SIR పై ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ..!
ఆమె తల్లి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చి చూడగా పక్క గదిలో నుంచి రోదనలు వినిపించడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. మిర్యాలగూడ రూరల్ సీఐ ఎ యన్ డి ప్రసాద్ సిబ్బందితో వచ్చి ఆధారాల సేకరించి ఆమెను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
క్లూస్ టీం ను పిలిపించి నమూనాలు సేకరించగా స్థానిక పదహారేళ్ల మైనర్ బాలుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. గతంలో కూడా అతను ఒకరిపై ఇలాంటి ఆకృత్యానికి పాల్పడుతుండగా స్థానికులు చూడడంతో అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రసాద్ విలేకరులకు తెలిపారు.
MOST VIEWS









