నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 13706 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేటి నుంచే దరఖాస్తులు..!
ఎంతో కాలంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త అందింది. గ్రామీణ బ్యాంకులో ఒకేసారి భారీ స్థాయిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. దానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కూడా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైంది.

నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 13706 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేటి నుంచే దరఖాస్తులు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఎంతో కాలంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త అందింది. గ్రామీణ బ్యాంకులో ఒకేసారి భారీ స్థాయిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. దానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కూడా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. మొత్తం 13706 ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కొన్ని పోస్టులకు ఒకే పరీక్ష, మరికొన్ని పోస్టులకు పని అనుభవం కూడా అవసరం ఉంటుంది. వీటికి కనీస అర్హత డిగ్రీ చదివి ఉండాలి.
ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వెలువడిన ఉద్యోగాలలో 8,183 ఉద్యోగాలు ఆఫీస్ అసిస్టెంట్, 4256 ఉద్యోగాలు ఆఫీసర్ స్కేల్ -1, 1472 ఉద్యోగాలు ఆఫీసర్ స్కేల్ -2, 250 ఉద్యోగాలు స్కిల్ 3, ఉద్యోగాల కోసం దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు.
ALSO READ : Miryalaguda : మిర్యాలగూడలో ఇంట్లోనే పేకాట అడ్డా.. పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్టు..!
వయస్సు :
ఈ ఉద్యోగాలకు వయోపరిమితి ఎలా ఉందో తెలుసుకుందాం.. ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్ -1 కు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఆఫీసర్ స్కేల్ -2 (మేనేజర్ పోస్టులకు) 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 3 (సీనియర్ మేనేజర్) ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చును.
రిజర్వేషన్ కలిగి ఉన్నవారికి వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
ఇవీ అర్హతలు :
ఉద్యోగాల దరఖాస్తుకు ఏ అర్హతలు ఉండాలంటే.. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. స్థానిక భాష పై పట్టు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
ALSO READ : వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదంలో పురుగు.. భక్తుల్లో ఆందోళన..!
ఆఫీసర్ స్కేల్ -1( అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు డిగ్రీతోపాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా పట్టా పొంది ఉండాలి. వీటితో పాటు స్థానిక భాష కంప్యూటర్ నాలెడ్జి కూడా ఉండాలి.
ఆఫీసర్ స్కేల్ -2 (జనరల్ మేనేజర్) పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ తో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్, అగ్రికల్చర్ లేదా హార్టికల్ హార్టికల్చర్ విభాగాలలో కనీసం 50% మార్కులు ఉండాలి. సి ఏ, ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్ లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ గా పనిచేసిన వారు దీనికి అర్హులు.
దరఖాస్తు విధానం :
https://www.ibps.in
అధికారిక వెబ్సైట్ సందర్శించి RRB ఎంపిక చేసి సంబంధిత పోస్ట్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవలసి ఉంది. ఎస్సీ, ఎస్టీ, పి డబ్ల్యు డి అభ్యర్థులకు 175 రూపాయలు, ఇతర కేటగిరి అభ్యర్థులకు 850 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ALSO READ : బోడుప్పల్ లో ఉద్రిక్తత.. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వెళ్లిన అధికారులపై దాడి..!
పరీక్ష విధానం :
ఐబీపీఎస్ ఆఫీసు అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు మాత్రమే ఉంటాయి. వారికి ఇంటర్వ్యూ ఉండదు. అయితే మిగిలిన పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలతో పాటు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.









