Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

బోడుప్పల్ లో ఉద్రిక్తత.. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వెళ్లిన అధికారులపై దాడి..!

ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు సోమవారం కొరడా ఝళిపించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని గౌతమ్‌ నగర్‌లో సర్వే నంబర్లు 28 నుంచి 39 వరకు ఉన్న ప్రభుత్వ భూముల్లో చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.

బోడుప్పల్ లో ఉద్రిక్తత.. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వెళ్లిన అధికారులపై దాడి..!

ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేస్తే సహించేది లేదు – తహసీల్దార్

మేడిపల్లి, మన సాక్షి

ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు సోమవారం కొరడా ఝళిపించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని గౌతమ్‌ నగర్‌లో సర్వే నంబర్లు 28 నుంచి 39 వరకు ఉన్న ప్రభుత్వ భూముల్లో చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.

ALSO READనల్గొండ జిల్లాలో దారుణం.. మానసిక వికలాంగురాలుపై అత్యాచారం..!

ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారన్న సమాచారంతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ సందర్భంగా కూల్చివేతలను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం . కూల్చివేత చర్యలకు వెళ్లిన రెవెన్యూ అధికారిపై భౌతిక దాడి జరిగినట్లు సమాచారం.

ALSO READహామీల అమలు లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు
ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదని మేడిపల్లి తహసీల్దార్ వెంకట నర్సింహ్మ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలను కాపాడటమే రెవెన్యూ శాఖ బాధ్యత అని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికారులు

ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టే వారిపై నిరంతరం నిఘా ఉంచుతామని తెలిపారు. రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడిన ఘటనపై కూడా అధికారులు తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు